ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శబరిమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త

ABN, Publish Date - Nov 21 , 2024 | 12:23 AM

అయ్యప్ప దీక్షలో శబరిమల వెళ్లే భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త ప్రకటించింది. అన్ని డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను బుక్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పించినట్లు ఆర్టీసీ ఆర్‌ఎం ఎన్‌ సుచరిత ఒక ప్రకటనలో తెలిపారు.

భగత్‌నగర్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): అయ్యప్ప దీక్షలో శబరిమల వెళ్లే భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త ప్రకటించింది. అన్ని డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను బుక్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పించినట్లు ఆర్టీసీ ఆర్‌ఎం ఎన్‌ సుచరిత ఒక ప్రకటనలో తెలిపారు. శబరిమల వెళ్లే భక్తులకు బస్సు ధరలను సంస్థ ప్రకటించినట్లు తెలిపారు. సూపర్‌ లగ్జరీ (నాన్‌ ఏసీ) 36 సీట్ల బస్సుకు కిలోమీటర్‌కు 59 రూపాయలు, వెయిటింగ్‌ చార్జ్‌ గంటకు 300 రూపాయలు కాగా, రాజధాని ఓసీ 36 సీట్ల కెపాసిటీ బస్సుకు కిలోమీటరుకు 77 రూపాయలు వెయిటింగ్‌ ఛార్జి గంటకు 300 రూపాయలుగా నిర్ణయిం చారు. గత సంవత్సరం కంటే బస్సు ఛార్జీలను తగ్గించినట్లు ఆర్‌ఎం తెలిపారు. పైన తెలిపిన చార్జీల్లో టోల్‌గేట్‌ చార్జీలు కూడా కలిపి ఉంటాయని, అదనంగా టోల్‌గేట్‌ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. గురుస్వామి బస్సు బుక్‌ చేసినచరో వారికి ప్రయాణ చార్జి మినహాయించబడుతుందన్నారు. గురుస్వామి ఒకటి కన్న ఎక్కువ బస్సులు బుక్‌ చేస్తే రెండ వ దానికి రోజుకు 300 రూపాయల చొప్పన కమిషన్‌ చెల్లిస్తామన్నారు. ఒక వంట మనిషి ఇద్దరు మణికంఠ స్వాములు (పది సంవత్సరాల లోపు వారు)ఒక అటెండరు అనుమతించ బడుతారన్నారు. బస్సు బుక్‌ చేసిన ఆర్‌టిసి నేస్తం, ఏటిబి ఏజెంట్లకు రోజుకు 300 రూపా యల చొప్పున కమిషన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. బస్సు లోపల లగేజీ పెట్టుకోవడానికి భక్తుల కోరిక మేరకు రెండు సీట్లు తీయబడుతాయన్నారు. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో బార్డర్‌ టాక్స్‌ ఎంవి టాక్స్‌లను బస్సు బుక్‌ చేసుకున్న వారే చెల్లించాల్సి ఉంటుందన్నారు. టిజిఎస్‌ఆర్‌టిసి బస్సులకు కేరళ రాష్ట్రంలో బార్డర్‌ టాక్స్‌ మినహాయింపు ఉందన్నారు. పార్కింగ్‌ రుసుము, పర్మిట్‌ టాక్సు బస్సు బుక్‌ చేసుకునే వారే చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆర్‌టిసి బస్సులలో అనుభవజ్ఞులు అయిన రూటు టెలిసిన మంచి నైపుణ్యం ఉన్న డైవర్లను ప్రతి బస్సుకు ఇద్దరిని ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి యాత్రను శుభ ప్రదం చేసుకోవాలని ఆర్‌ఎం కోరారు.

Updated Date - Nov 21 , 2024 | 12:23 AM