ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

భూ సంస్కరణలను నీరుగార్చిన పాలకులు

ABN, Publish Date - Mar 25 , 2024 | 12:23 AM

భూసంస్కరణల్లో ట్రస్ట్‌లు, దేవాలయాలు, తోటలు తదితర విభాగాలకు మినాహాయింపులు ఇచ్చి భూసంస్కరణలను పాలకులు నీరుగార్చారని పలు వక్తలు ఆరోపించారు. ఆదివారం గోదావరిఖనిలోని హెచ్‌ఎం ఎస్‌ కార్యాలయంలో రైతు సమస్యల సాధన సమితి ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు.

మాట్లాడుతున్న రియాజ్‌అహ్మద్‌

- స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చేయాలి

- రైతు సదస్సులో వక్తలు

కోల్‌సిటీటౌన్‌, మార్చి 24: భూసంస్కరణల్లో ట్రస్ట్‌లు, దేవాలయాలు, తోటలు తదితర విభాగాలకు మినాహాయింపులు ఇచ్చి భూసంస్కరణలను పాలకులు నీరుగార్చారని పలు వక్తలు ఆరోపించారు. ఆదివారం గోదావరిఖనిలోని హెచ్‌ఎం ఎస్‌ కార్యాలయంలో రైతు సమస్యల సాధన సమితి ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘాల నాయకులు వర్ణ వెంకటరెడ్డి, పోరెడ్డి వెంకటరెడ్డి, హెచ్‌ఎంఎస్‌ నాయకులు రియాజ్‌అహ్మద్‌, ముడిమాడుగుల మల్లన్న మాట్లాడారు. స్వామినాథన్‌ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏ పంట వేయాలి అనే విషయంలో రైతుకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, పెట్టుబడిదారులకు అవసరమైన పంటలను పండించాల్సిన దుస్థితి రైతుకు ఏర్పడిందన్నారు. రైతులకు మార్కెట్లో కూడా అన్యాయం జరుగుతోందన్నారు. దేశంలో వ్యవసాయ రంగ భూమిని వ్యాపారాలకు ధారాదత్తం చేసేలా పాలకులు చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌ రాష్ట్రంలో నాడు లక్షకు పైగా చెరువులు ఉండేవన్నారు. నిజాం సాగర్‌లాంటి ప్రాజెక్టులు కూడా నాటి పాలకులు ఆనాడు ఏర్పాటు చేశారని తెలిపారు. ఇప్పుడు అవి 34 వేల చెరువులకు దిగజార్చారని రైతులకు చేయూత ఇవ్వాల్సిన పాలకులు వారిని అణిచివేతకు గురిచేశారన్నారు. సింగరేణి సంస్థకు భూమి ఇచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని, పని పూర్తి అయిపోయిన తరువాత తిరిగి సాగు యోగ్యాన్ని రైతులకు అందించాలని, అసైన్డ్‌ భూములు బడుగుబలహీన దళిత వర్గ రైతులకు పంచాలని, స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయాలని తదితర తీర్మాణాలు చేశారు. ఏలేశ్వరం వెంకటేశ్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో కొడిపుంజుల రాజన్న, ఎరుకుల రాజన్న, సుదర్శన్‌, దుర్గం నర్సయ్య, నేదునూరి నరేష్‌, గుమ్మడి వెంకన్న, దుర్గం నగేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2024 | 12:23 AM

Advertising
Advertising