ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉదయం బడి.. మధ్యాహ్నం సర్వే

ABN, Publish Date - Nov 16 , 2024 | 01:17 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వేతో ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రభావం పడుతోంది. ఈనెల 6 నుంచి ప్రారంభమైన సమగ్ర సర్వేకు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీలను ఎన్యూమ రేటర్లుగా నియమించారు.

-విధుల్లో టీచర్లు, అంగన్‌వాడీలు

-ఒంటి పూట తరగతుల నిర్వహణ

-పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో తగ్గుతున్న విద్యార్థుల హాజరు

-పిల్లల భవిష్యత్‌పై తల్లిదండ్రుల ఆందోళన

కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వేతో ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రభావం పడుతోంది. ఈనెల 6 నుంచి ప్రారంభమైన సమగ్ర సర్వేకు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీలను ఎన్యూమ రేటర్లుగా నియమించారు. దీనితో ఎన్యూమరేటర్లుగా విధులు నిర్వహిస్తున్న పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనితో ఆయా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం అందించి ఇళ్లకు పంపిస్తున్నారు. ఈనెల 30వ తేదీ వరకు సర్వేకు టీచర్లు, అంగన్‌వాడీలను వినియోగిస్తుండడంతో చదువులు ముందుకు సాగవని, దీని ప్రభావం తమ పిల్లల భవిష్యత్‌పై పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఫ30శాతం మంది గైర్హాజరు

కొంత మంది తల్లిదండ్రులు ఒంటి పూట బడులకు, చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించడం లేదు. దీనితో సర్వే ప్రారంభమైన రోజు నుంచి విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని, ఇప్పటికే 30 నుంచి 40శాతం మంది విద్యార్థులు గైర్హాజరవుతున్నారని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించి బడీడు పిల్లలను, బడి మానేసిన పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్‌ భాషల్లో విద్యాబోధన చేస్తున్నా కొంత మంది తల్లిదండ్రులు ప్రైవేట్‌ విద్యాసంస్థల వైపే మొగ్గు చూపుతున్నారు.

ఫ గ్రామాల్లో వరి కోతలతో నత్తనడకన సర్వే

ఒంటి పూట బడులకు వెళ్తున్న ఉపాధ్యాయులు కూడా సర్వేపై నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వరి కోతలు, ధాన్యం అమ్ముకునే ఈ సమయంలో రైతు కుటుంబాల ఇళ్లకు వెళితే మధ్యాహ్నం తాళం వేసి ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనితో సర్వే చేయలేక పోతున్నామని గ్రామీణ ప్రాంతాల టీచర్లు వాపోతున్నారు. అర్బన్‌ ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలో ఉండడం లేదని, ఉదయం, సాయంత్రం వెళితే తప్ప సర్వే ముందుకు సాగడం లేదని పేర్కొంటున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా పిల్లల సంఖ్య తగ్గుతోందని చెబుతున్నారు. ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే ఎమ్యూనరేటర్లు, సూపర్‌వైజర్లు, ఇతర అధికారులు కూడా సర్వేకు వెళ్తుండడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఉద్యోగులు, అధికారులు అందుబాటులో ఉండటం లేదని, దీనితో సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ప్రజలు వాపోతున్నారు. 2014లో ఆనాటి ప్రభుత్వం నిర్వహించినట్లు ఒకే రోజు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తే బాగుండేదని, 25 రోజుల పాటు సర్వే నిర్వహించడంతో సర్వే పట్ల ప్రజలు కూడా ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పాఠశాలల్లో చదివే తమ పిల్లల చదువుపై సర్వే ప్రభావం పడకుండా చూడాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Nov 16 , 2024 | 01:17 AM