ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అనుమానాలకు తెర..!

ABN, Publish Date - Jul 12 , 2024 | 12:37 AM

రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీపై నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించడంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గల చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేప పిల్లలు పోసేందుకు ఈనెల 8న ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది.

- ఉచిత చేప పిల్లల పంపిణీకి టెండర్లు

- జిల్లాలో కోటి 58 లక్షల చేప పిల్లల లక్ష్యం

- ఈనెలాఖరు వరకు పూర్తికానున్న టెండర్లు

- వచ్చే నెలలో పంపిణీకి శ్రీకారం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీపై నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించడంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గల చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేప పిల్లలు పోసేందుకు ఈనెల 8న ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈనెల 23వ తేదీ వరకు టెండర్లను స్వీకరించనున్నారు. ఆ తర్వాత టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లకు ఏ మేరకు అర్హతలున్నాయో సాంకేతిక కమిటీ పరిశీలించిన తర్వాత తక్కువ ధర కోట్‌ చేసే కాంట్రాక్టర్లకు చేప పిల్లలు పంపిణీ చేసే టెండర్లను కట్టబెట్టనున్నారు. టెండర్ల ప్రక్రియ ఈనెలాఖరు వరకు పూర్తయితే ఆగస్టు నెల రెండో వారం నుంచి మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయనున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో చేప పిల్లలు పెంచి మత్స్య సంపదను గతంలోకంటే రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు 2015 నుంచి మత్స్యకారులకు ఉచితంగా ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేయడం ప్రారంభించింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తారా, లేదా అనే అనుమానాలు మత్స్యకారుల్లో నెలకొన్నాయి. ఇటీవల ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించి మత్స్యకారుల్లో నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేసింది.

ఫ 201 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు..

జిల్లాలో 201 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా, ఇందులో 14,900 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. 1073 చెరువులు, కుంటలు, శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌తో పాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు ఉన్నాయి. వీటిలో చేపలు పెంచుకుని ఉపాధి పొందేందుకు ప్రభుత్వం చెరువులు, కుంటు, రిజర్వాయర్లను మత్స్యకారులకు ప్రతి ఏటా లీజుకు ఇవ్వడంతో పాటు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. జిల్లాలో ఉన్న చెరువులు, కుంటలు, రిజర్యాయర్లు, బ్యారేజీల్లో పోసేందుకు కోటి 58 లక్షల చేప పిల్లలు అవసరం అవుతాయని జిల్లా మత్స్య శాఖ అంచనాలు తయారు చేసింది. 1061 చెరువుల్లో 35 నుంచి 40 ఎంఎం సైజు గల చేప పిల్లలు కోటి 2 లక్షల 2 వేల చేప పిల్లలు, 12 చెరువులు, 3 రిజర్వాయర్లలో 80 నుంచి 100 ఎంఎం సైజు గల చేప పిల్లలు, 56 లక్షలు అవసరం ఉంటాయని అంచనా వేశారు. శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌లో 12 లక్షల 21 వేల చేప పిల్లలు, అన్నారం బ్యారేజీలో 8 లక్షల 79 వేలు, సుందిళ్ల బ్యారేజీలో 11 లక్షల 41 వేలు, ఇతర 12 పెద్ద చెరువుల్లో 26 లక్షల 19 వేల చేపపిల్లలు పోయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో సాధారణ వర్షపాతం మాత్రమే నమోదయ్యింది. భారీ వర్షాలు ఇంకా పడలేదు. దీంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేపల పెంపకానికి సరిపడా నీళ్లు లేవు. భారీ వర్షాలు పడితే గానీ నీటి వనరులు నిండే పరిస్థితి లేదు. వర్షాలు పడేలోపు టెండర్లు పూర్తి కానున్నాయి. ఆగస్టులో రెండో వారంలో చేప పిల్లలు పంపిణీ చేసే అవకాశాలున్నాయి.

ఫ చేప పిల్లల పంపిణీ టెండర్లు ఆహ్వానించాం..

- భాస్కర్‌, జిల్లా మత్స్య శాఖాధికారి, పెద్దపల్లి

జిల్లాలో గల చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేపలు పెంచి మత్స్యకారులు ఉపాధి పొందేందుకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసేందుకు ఈనెల 8న టెండర్లను ఆహ్వానించాం. 23 వరకు గడువు విధించాం. అనంతరం సాంకేతిక కమిటీ పరిశీలించిన తర్వాత ఫైనల్‌ చేస్తాం. వర్షాలు పడి నీటి వనరులు నిండిన తర్వాత మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేస్తాం.

Updated Date - Jul 12 , 2024 | 12:37 AM

Advertising
Advertising
<