ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పోకిరీలకు ‘షీ’ టీంల దడ

ABN, Publish Date - Nov 07 , 2024 | 01:08 AM

కమిషనరేట్‌ వ్యాప్తంగా షీ టీంలు పోకిరీలకు దడపుట్టిస్తున్నాయి. పోలీస్‌ కమిషనర్‌ అభిషేక్‌ మొహంతి పర్యవేక్షణలో కమిషనరేట్‌ వ్యాప్తంగా 10కిపైగా షీ టీంలు పనిచేస్తున్నాయి.

-ముఖ్య కూడళ్లలో ప్రత్యేక నిఘా

-30 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు

-120 మందికి కౌన్సెలింగ్‌

కరీంనగర్‌ క్రైం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : కమిషనరేట్‌ వ్యాప్తంగా షీ టీంలు పోకిరీలకు దడపుట్టిస్తున్నాయి. పోలీస్‌ కమిషనర్‌ అభిషేక్‌ మొహంతి పర్యవేక్షణలో కమిషనరేట్‌ వ్యాప్తంగా 10కిపైగా షీ టీంలు పనిచేస్తున్నాయి. మహిళలు, విద్యార్థినులు, పోకిరీల వేధింపులను ఎదుర్కొన్నట్లయితే ఫిర్యాదు చేసే విధానంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2016లో కమిషనరేట్‌లో షీ టీంలు ప్రారంభమయ్యాయి. షీటీంకు చెందిన పోలీసులు మఫ్టీలో ముఖ్య కూడళ్ల వద్ద నిఘా పెట్టి పోకిరీలను ఆధారాలతో పట్టుకునేందుకు ఆధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నారు. వేధింపుల తీవ్రతను బట్టి తల్లిదండ్రుల సమక్షంలో ఆధారాలను చూపిస్తూ కౌన్సెలింగ్‌ను నిర్వహించడంతో పాటు క్రిమినల్‌ కేసులను నమోదుచేస్తున్నారు.

ఫ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు

2023 జనవరి నుంచి అక్టోబరు 31 వరకు షీటీం లకు 197 ఫిర్యాదులు అందగా ఇందులో వేధింసుల తీవ్రత ఆధారంగా 30 క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. 102 ఫిర్యాదులు నేరుగా షీటీంకు రాగా, వాట్సప్‌ ద్వారా 13, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా 4, పోలీస్‌కమిషనర్‌ ద్వారా 10, ఆతర పోలీసు ఠాణాలు, అధికారుల ద్వారా 6 ఫిర్యాదులు అందాయి. మరో 62 పోకిరీలు షీటంలకు రెడ్‌హాండెడ్‌గా పట్టుబడటంతో కేసులు నమోదు చేశారు. 27 మందిపై పెట్టి కేసులు నమోదు చేసి, 120 మందికి కుటుంబం సమక్షలో కౌన్సిలింగ్‌ నిర్వహించారు. 10 నెలల కాలంలో షీటం పోలీసులు కమిషనరేట్‌ వ్యాప్తంగా 155 అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.

ఫఫిర్యాదులకు ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌

విద్యాసంస్థలకు షీ టీంలు స్వయంగా వెళుతూ అశ్లీలత, వేధింపుల తీవ్రత, గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌లపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. పోలీసుశాఖ నేరుగా పోలీసు ఠాణాలకు వచ్చి విద్యార్థినిలు, మహిళలు ఫిర్యాదు చేయాల్సిన పనిలేకుండా వాట్సాప్‌ నంబర్‌ 8712670759, డయల్‌ 100 నెంబరును, క్యూఆర్‌కోడ్‌ను ప్రదర్శిస్తున్నారు. ప్రయాణ సమయంలో మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన టీ సేఫ్‌ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌ కలిగిన ప్రతి విద్యార్థిని, మహిళలతో డౌన్‌లోడ్‌ చేయిస్తున్నారు.

ఫ ఫిర్యాదుదారుల వివరాలు గోప్యం

షీ టీం పోలీసులు వేధింపులు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో నిఘాను కొనసాగిస్తూ ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగం ద్వారా పోకిరీల ఆధారాలను సేకరిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. మహిళలు, విద్యార్థినిలు నేరుగా ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా సెల్‌ఫోన్‌ , వాట్సాప్‌, ట్విట్టర్‌ ద్వారా అందుతున్నాయి. ఫిర్యాదు చేసిన మహిళలు విద్యార్థుల పేర్లను గోప్యంగా ఉంచడంతో పాటు వారిని పోలీసు ఠాణాలకు రమ్మనకుండా షీ టీం పోలీసులు బాధిత మహిళల వద్దకు వెళ్లి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. టీంల చురుకైన పనితీరుకు విశేష స్పందన లభిస్తున్నది. మహిళల భద్రత కోసం పోలీసుశాఖ షీ టీంల ద్వారా తీసుకుంటున్న చర్యలు భద్రతాభావాన్నిపెంపొందిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంద్వారా పోకిరీల వేధింపులపై చర్యలు తీసుకుంటున్నారు. దీంతో మహిళలు, విద్యార్థులు నిర్భయంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు.

ఫ వేధింపులపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలి

-శ్రీలత, కరీంనగర్‌ మహిళా ఠాణా సీఐ

వేధింపులను ఎదుర్కొనే మహిళలు, విద్యార్థినిలు నిర్భయంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలి. షీ టీంలకు చెందిన పోలీసులు వివరాలను గోప్యంగా ఉంచి బాధితులకు న్యాయం చేస్తారు. పోలీస్‌ కమిషనర్‌ అభిషేక్‌ మొహంతి నేతృత్వంలో షీ టీంలు నూతనోత్సహంతో పనిచేస్తున్నాయి. పోకిరీల ఆగడాలను నియంత్రించేందుకు మరింత పగడ్బందీ చర్యలతో ముందుకు సాగుతాం.

Updated Date - Nov 07 , 2024 | 01:09 AM