ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘పది’ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి

ABN, Publish Date - Nov 07 , 2024 | 12:48 AM

పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు.

పెద్దపల్లి కల్చరల్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. రాబోయే పదవ తరగతి పరీక్షలలో ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థులకు అధిక సంఖ్యలో 10 జీపీఏ వచ్చేలా కార్యాచరణ అమలు చేయాలన్నారు. బుధవారం కలెక్టర్‌ కోయ శ్రీహర్ష జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఎల్‌ఐపీ అమలు, పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్‌ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులకు అమలుచేస్తున్న ఎల్‌ఐపీ కార్యక్రమం పకడ్బందీగా జరగాలని, విద్యార్థులను ఉత్సాహపరుస్తూ వారికి పాఠ్యాంశాలు సరిగ్గా అర్థమయ్యే విధంగా బోధించాలని కలెక్టర్‌ సూచించారు. పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే సరిపోదని, రాబోయే పరీక్షలలో ఎక్కువ మంది విద్యార్థులకు 10/10జీపీఏ వచ్చే విధంగా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఉన్నత పాఠశాలలోనే హెడ్‌మాస్టర్‌ ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయులు పిల్లలను దత్తత తీసుకొని పదవ తరగతి పరీక్షలకు ప్రిపేర్‌ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి. మాధవి, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త పీఎం షేక్‌, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 12:48 AM