మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు అమలు చేయాలి
ABN, Publish Date - Oct 02 , 2024 | 12:24 AM
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను అమలు చేయాలని అఖిల భారత ప్రజా తంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కళ్యాణ్‌నగర్, అక్టోబరు 1: మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను అమలు చేయాలని అఖిల భారత ప్రజా తంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం గోదావరిఖని శ్రామిక భవన్‌లో పెద్దపల్లి 3వ జిల్లా మహాసభలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెండావిష్కరణ చేసి మల్లు స్వరాజ్యం, సీతారాం ఏచూరి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయన్నారు. ఎన్ని ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చినా మహిళపై, యువతులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. మహిళల రక్షణ కోసం దాడులను సంఘటితంగా ఎదుర్కొవాలని, ఇండ్ల స్థలాల సాధన కోసం ఐద్వా ముందుంటుందని పేర్కొన్నారు. మహిళల సమస్యలపై ఐద్వా పోరాటలు నిర్వహిస్తుందని తెలిపారు. భవిష్యత్‌లో మహిళల హక్కులు, రక్షణ, దాడులపై సమావేశంలో తీర్మానాలు చేశారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు అనుముల మహేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో మల్లు లక్ష్మితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Oct 02 , 2024 | 12:24 AM