ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సైబర్‌ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు

ABN, Publish Date - Apr 05 , 2024 | 12:29 AM

సైబర్‌ నేరాలను త్వరితగతిన పరిష్కరించేందుకు పోలీస్‌ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ సన్‌ ప్రీత్‌ సింగ్‌ పేర్కొన్నారు. జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యా లయంలో సైబర్‌ వారియర్స్‌కు ఫోన్లు, సిమ్‌ కార్డుల ను ఎస్పీ అందజేశారు.

సైబర్‌ వారియర్స్‌తో జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌

- ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌

జగిత్యాల టౌన్‌, ఏప్రిల్‌ 4 : సైబర్‌ నేరాలను త్వరితగతిన పరిష్కరించేందుకు పోలీస్‌ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ సన్‌ ప్రీత్‌ సింగ్‌ పేర్కొన్నారు. జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యా లయంలో సైబర్‌ వారియర్స్‌కు ఫోన్లు, సిమ్‌ కార్డుల ను ఎస్పీ అందజేశారు. జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో సైబర్‌ నేరాలపై ప్రత్యేక శిక్షణ పొందిన సైబర్‌ వారియర్స్‌ను నియమించడం జరిగిందన్నారు. సైబర్‌ వారియర్స్‌ ప్రత్యేకంగా సైబర్‌ నేరాల కట్టడిపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో 18 మంది సైబర్‌ వారియర్స్‌కు ప్రత్యేక ఫోన్లను అందించి సిమ్‌ కార్డుల ను ఇచ్చామన్నారు. సైబర్‌ నేరాల బాధితులు తక్షణమే నేరాలకు గురైతే 1930 లేదా సైబర్‌ వారియర్స్‌కు కేటాయించిన ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించాలని కోరారు. సైబర్‌ మోసాలకు గురైన బాధితులు ఏమాత్రం ఆందోళనకు గురికాకుండా సంఘటన చోటుచేసుకున్న తర్వాత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం జిల్లాలోని 18 పోలీస్‌ స్టేషన్లకు సంబంధించిన సైబర్‌ వారియర్స్‌ ఫోన్‌ నెంబర్స్‌ను ఎస్పీ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సైబర్‌ క్రైం డీఎస్పీ రంగారెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 12:29 AM

Advertising
Advertising