ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సర్వే ప్రారంభం

ABN, Publish Date - Nov 10 , 2024 | 01:20 AM

జిల్లాలో శనివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభం అయ్యింది. నిర్ధేశించిన మేరకు నియమించిన ఎన్యూమరేటర్లు సర్వేను ప్రారంభించారు. తొలిరోజు ఎన్యూమరేటర్లు కొంత తడబడినప్పటికీ 13,649 కుటుంబాల సర్వే పూర్తి చేశారు.

పెద్దపల్లి పట్టణంలోని 18వ వార్డులో సర్వేను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

జిల్లాలో మొదలైన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే

తొలిరోజు 13,649 కుటుంబాల సర్వే

కుల, మత, సామాజిక వర్గాల్లో ‘ఏమీ లేదు’ అనే అంశం

రాజకీయ నేపథ్యంలో నాలుగు అంశాల తొలగింపు

సర్వేను పరిశీలించిన కలెక్టర్‌

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో శనివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభం అయ్యింది. నిర్ధేశించిన మేరకు నియమించిన ఎన్యూమరేటర్లు సర్వేను ప్రారంభించారు. తొలిరోజు ఎన్యూమరేటర్లు కొంత తడబడినప్పటికీ 13,649 కుటుంబాల సర్వే పూర్తి చేశారు. గతనెల 29న విడుదల చేసిన సర్వే ఫారంలో కొన్ని చేర్పులు, మార్పులు చేసి శుక్రవారం సాయంత్రం కొత్త ఫారం జారీ కాగా, దానిని హుటాహుటిన ప్రింటింగ్‌ చేయించి ఎన్యూమరేటర్లకు పంపిణీ చేశారు. సర్వే ఫారంలో అదనంగా కుల, మత, సామాజిక అంశాలకు సంబంధించి అదనంగా ‘ఏమీ లేదు’ అనే అంశాన్ని చేర్చారు. రాజకీయ నేపథ్యంలో నాలుగు అంశాలను తొలగించారు. 6వ కాలంలో 4 అంశాలు పేర్కొనగా అందులో మరొక అంశాన్ని జోడించడంతో దానిపై స్టిక్టర్‌ వేయాలని అధికారులు సూచించారు. జిల్లాలో ఈనెల 8వ తేదీ వరకు 2,54,389 కుటుంబాలను గుర్తించారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 90,330, గ్రామీణ ప్రాంతాల్లో 1,64,059 కుటుంబాలను గుర్తించారు. సర్వే నిర్వహణకు 2,020 మంది ఎన్యూమరేటర్లను నియమించారు. 1850 బ్లాక్‌లను గుర్తించి సూపర్‌వైజర్లను నియమించారు. ఒక్కో ఎన్యూమరేటర్‌ రోజుకు 10 చొప్పున 15 రోజుల్లో 150 కుటుంబాల సర్వే చేయాలని పేర్కొన్నారు. తొలిరోజు 1849 మంది ఎన్యూమరేటర్లు 13,649 కుటుంబాల సర్వే పూర్తి చేశారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 4,928 కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల్లో 8,721 కుటుంబాల సర్వే పూర్తిచేశారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పెద్దపల్లి పట్టణంలోని 18వ వార్డులో, సుల్తానాబాద్‌, ధర్మారం మండలాల్లోని పలు గ్రామాల్లో సర్వేను పరిశీలించారు. మిగతా అధికారులు సైతం క్షేత్రస్థాయిలో సర్వేను పరిశీలించారు.

సర్వే ఫారంలో చేర్పులు, మార్పులు

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఫారంలో పలు అంశాలకు సంబంధించి చేర్పులు, మార్పులు చేశారు. కుల, మతాలు, సామాజిక వర్గానికి సంబంధించి ‘ఏమి లేదు’ అనే అంశాన్ని చేర్చడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కులగణన చేపట్టాలని అసెంబ్లీ తీర్మానం చేసినప్పటికీ, ఒక కులగణన కాకుండా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ సర్వే కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్ర కేబినెట్‌లో తీర్మానాన్ని కూడా ఆమోదించారు. ఈనెల 6వ తేదీ నుంచి సర్వే చేయాలని షెడ్యూల్‌ ఖరారు చేశారు. ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు పార్ట్‌ 1, పార్ట్‌ 2లో అనుబంధ ప్రశ్నలతో కలిపి 75 ప్రశ్నలను చేరుస్తూ రూపొందించిన సర్వే ఫారాన్ని గతనెల 29వ తేదీన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విడుదల చేశారు. మొదట పంపిన సర్వే ఫారాన్ని ప్రింటింగ్‌ చేయించ వద్దని, మరొక ఫారం పంపిస్తామని జిల్లా అధికారులకు ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారు. 5వ తేదీ వరకు కుటుంబాల గుర్తింపు పూర్తి కాకపోవడంతో, మరో మూడు రోజులు గడువు పెంచి 9వ తేదీ నుంచి సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. శుక్రవారం జిల్లాలకు పంపిన ఫారాలను హుటాహుటిన ప్రింటింగ్‌ చేయించి శనివారం నుంచి సర్వేను ప్రారంభించారు. ఈ సర్వే ప్రత్యేకించి కుల గణన చేసేందుకేనని ప్రజలంతా భావిస్తున్నప్పటికీ కాలం నంబర్‌ 6లో ఉన్న 01 ఎస్సీ, 02, ఎస్టీ, 03 బీసీ, 04 ఓసీ అని ఉంటే మాత్రం దానిపై స్టిక్కర్‌ వేయాలని ఆదేశించారు. 5వ కాలంలో మతం, 6వ కాలంలో సామాజిక వర్గం, 7వ కాలంలో కులం అని ఇచ్చారు. ఎన్యూమరేటర్లకు ఇచ్చిన బుక్‌లెట్‌లో పేర్కొన్న కోడ్‌ నంబర్లను నమోదు చేయాలన్నారు. ఇందులో కొత్తగా 5వ కాలం 01లో ఏ మతం లేదు, 6వ కాలం 01లో ఏ సామాజిక వర్గం లేదు, 7వ కాలంలో కులానికి సంబంధించి ఏ కులం లేదు అనే అంశానికి కోడ్‌ 999 వేయాలని బుక్‌లెట్‌లో పేర్కొన్నారు. కులగణన ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని చెబుతున్న ప్రభుత్వం ఏ మతం లేదు, ఏ సామాజిక వర్గం లేదు, ఏ కులం లేదు అని పేర్కొనడంలో ఆంతర్యమేమిటని పలువురు అంటున్నారు. అలాగే రాజకీయ నేపథ్యానికి సంబంధించి 46వ కాలంలో నాలుగు ప్రశ్నలను తొలగించారు. ఆఫీస్‌ బేరర్‌లో మినిస్టర్‌, చైర్మన్‌, స్పీకర్‌, మొదలగు అనే అంశాలు, ఎన్ని టర్ములు అంశాన్ని తొలగించారు.

Updated Date - Nov 10 , 2024 | 01:20 AM