ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పకడ్బందీ ప్రణాళికతో రామగుండం అభివృద్ధికి అడుగులు

ABN, Publish Date - Nov 24 , 2024 | 12:50 AM

రామగుండం అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళికతోనే అడుగులు వేస్తున్నామని ఎమ్మె ల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు.

గోదావరిఖని, నవంబరు 23: రామగుండం అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళికతోనే అడుగులు వేస్తున్నామని ఎమ్మె ల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. రామగుండంలో నా లుగు నెలలుగా అసలు పని మొదలు పెట్టామన్నారు. నియోజకవర్గంలో రామగుండం నగరంతో పాటు పాల కుర్తి, అంతర్గాం మండలాలను అభివృద్ధి చేసేందుకు ప్ర ణాళికబద్ధంగా నిధులు తీసుకువస్తున్నామన్నారు. రామ గుండం నగరంలో రూ.280కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ, అ మృత్‌, సీఎం స్పెషల్‌ గ్రాంట్‌, డీఎంఎఫ్‌టీ నిధులతో ప నులు మొదలయ్యాయన్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లకు రూ.15కోట్ల సీఆర్‌ఆర్‌ నిధులు, రూ.5కోట్ల ఎంఆర్‌ఆర్‌ నిధులు మంజూరయ్యాయన్నారు. ఒక్కో మండలానికి రూ.10కోట్లు కేటాయించనున్నట్టు ఆయన తెలిపారు. బండలవాగు ప్రాజెక్టు పనులు గతంలో మొదలుపెట్టార ని, ఇద్దరు ఎమ్మెల్యేలు మారినా పూర్తికాలేదన్నారు. కాం ట్రాక్టర్లు కూడా పారిపోయారని, తాను భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలపై తాను ఒత్తిడి తెచ్చి కాంట్రాక్టర్ల కు బిల్లులు ఇప్పించడంతో పాటు కొత్త నిధులు ఇప్పిం చామన్నారు. రెండు నెలల్లో పనులు పూర్తయ్యేలా ఒత్తిడి తెస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే రూ.22కోట్లతో ఆర్‌అండ్‌ఆర్‌ సమస్య కూడా పరిష్కారమయ్యేలా చర్య లు చేపట్టామన్నారు. రామగుండంలో సింగరేణి నిధుల తో మెడికల్‌ కళాశాల నిర్మాణం జరిగితే రూ.280కోట్లు విడుదల అయినా పనులు పూర్తి కాలేదని, సింగరేణి కూడా మళ్లీ నిధులు ఇచ్చేందుకు ముందుకు రాలేదన్నా రు. తాను ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సింగరేణితో రూ.140కోట్లు ఇప్పించి హాస్పిటల్‌ నిర్మాణాన్ని ప్రారంభిం చామన్నారు. మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా డెంట ల్‌, నర్సింగ్‌ కళాశాలలు, పీజీ కోర్సులు మంజూరు ఇవ్వా లని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరగా రూ.26కోట్లతో నర్సింగ్‌ కళాశాల ఏర్పాటుకు జీఓ ఇచ్చారని, డెంటల్‌ కళాశాల ప్రతిపాదనలు కూడా ఢిల్లీకి వెళ్లాయన్నారు. రామగుండం ఫ్లై ఓవర్‌ కుడివైపు రైట్‌ ఆర్మ్‌ నిర్మాణానికి రూ.10కోట్లతో ప్రతిపాదనలు చేశామని, మరో రూ.60 కోట్లు ఆర్‌అండ్‌ బీ రహదారులు, మరో రూ.350కోట్లతో పాలకుర్తి లిఫ్ట్‌కు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రామ గుండంలో బసంత్‌నగర్‌లో ఎయిర్‌ పోర్టు వయబుల్‌ కాదని గతంలో నివేదిక ఇచ్చారని, కొత్తగా 500 నుంచి 600ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రయత్నిస్తున్నా మని, కలెక్టర్‌ ఆధ్వర్యంలో స్థలాల పరిశీలన జరుగుతుం దన్నారు. రామగుండం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు వల్ల ఈ ప్రాంత కార్మికులకు ప్ర యోజనం కలుగనున్నదని, పేరు మార్పుపై తర్జనభర్జన జరుగుతుం దన్నారు. రామగుండంలో అభివృ ద్ధికి అడుగులు పడుతుంటే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు కొందరు నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని, మండిపడ్డారు. గతం లో విభజన బిల్లులో ఎన్‌టీపీసీలో 4వేల మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టు మంజూరైతే తమకు వద్దని అప్పటి ప్రభుత్వాలు చెప్పాయని, తాము పట్టుబట్టి 800 మెగా వాట్ల విద్యుత్‌ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వంలో పీపీఏ ఇప్పించి యూనిట్ల స్థాపనకు మార్గం సుగమమం చేశా మన్నారు. తక్కువ కాలుష్యం ఉండేలా సూపర్‌ క్రిటికల్‌ పవర్‌ స్టేషన్‌ నిర్మాణం జరుగనున్నదని, దీని వల్ల ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. రామ గుండంలో విద్యుత్‌ కేంద్రం, ఓపెన్‌కాస్టులో 500మెగావా ట్ల మరో విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు కానున్నాయని, రామగుండం, మంథనికి కనెక్టివిటీ పెంచేందుకు గోదావ రిఖని నుంచి జేఎన్‌టీయూ వరకు రూ.14కోట్లతో ఫోర్‌ లైన్‌ రోడ్డు నిర్మించనున్నామని, పాత రోడ్డును కూడా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విలేకరుల సమావేశంలో మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజేష్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2024 | 12:50 AM