ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

ABN, Publish Date - Nov 21 , 2024 | 12:22 AM

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎక్సైజ్‌ సీఐ మాధవిలత అన్నారు. బుధవారం జమ్మికుంట పట్టణంలోని కాకతీయ హైస్కూల్‌లో గంజాయి, డ్రగ్స్‌, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు ఏర్పా టు చేశారు.

జమ్మికుంట రూరల్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎక్సైజ్‌ సీఐ మాధవిలత అన్నారు. బుధవారం జమ్మికుంట పట్టణంలోని కాకతీయ హైస్కూల్‌లో గంజాయి, డ్రగ్స్‌, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ సీఐ మా ట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండి బంగారు జీవితాన్ని నిర్మించుకోవాలన్నారు. జీవితంలో ఉన్న త శిఖరాలను అందుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

హుజూరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చెడు అలవా ట్లకు దూరంగా ఉండి ఉన్నత స్థాయికి ఎదగాలని హుజూరా బాద్‌ ఎక్సైజ్‌ ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ అన్నారు. బుధవారం హుజూరాబాద్‌ పట్టణంలోని న్యూ శాతావాహన హైస్కూల్‌ లో ప్రపంచ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు మత్తుపదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలను అలవాటు చేసుకోవద్దని, వాటిని సేవించడం వల్ల భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, పోలీస్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇల్లందకుంట(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్‌కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియ ల్‌ ట్రస్టు వ్యవస్థాపకుడు గంగిశెట్టి జగదీశ్వర్‌ సుమారు 200మంది విద్యార్థులకు ఉచితంగా పెన్నులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం జయప్రకాష్‌, ఉపాధ్యాయు లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 12:22 AM