ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సకాలంలో ప్రభుత్వ భూముల సర్వే పూర్తి చేయాలి

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:43 AM

ధర్మారం మండలంలో చేపట్టి న ప్రభుత్వ భూముల సర్వే ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని ప్రభు త్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు.

పెద్దపల్లి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ధర్మారం మండలంలో చేపట్టి న ప్రభుత్వ భూముల సర్వే ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని ప్రభు త్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. మంగళ వారం ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ సమీకృత జిల్లా కలెక్టరేట్‌ లో కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి ఽసంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మారం మండ లంలోని భూమి లేని నిరుపేదలకు అసైన్మెంట్‌ భూమి పంపిణీ చేసే దిశగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ భూముల సర్వే ప్రక్రియను చేపట్టామని అన్నారు. ఽభూముల సర్వే సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ధర్మారం మండలంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా లలో రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని ప్రభుత్వ విప్‌ అధికారులకు సూచించా రు. రైతులకు ఎక్కడ ఇబ్బందులు కల్గకుండా, రైస్‌ మిల్లుల వద్ద ధాన్యం కోత విధించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం నాణ్యత ప్రమాణాలు పరిశీలించి నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు ఎప్పటికప్పుడు జరగాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వేణు, డీసీఓ శ్రీమాల, ఏడీ సర్వే శ్రీనివాస్‌, ఆర్డీవో గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:43 AM