దూరవిద్యను సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - Sep 05 , 2024 | 12:39 AM
చదువు మధ్యలో మానేసినవారు, గృహిణిలు దూరవిద్యను సద్వినియోగం చేసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ సూచించారు.
కోల్‌సిటీటౌన్, సెప్టెంబరు 4: చదువు మధ్యలో మానేసినవారు, గృహిణిలు దూరవిద్యను సద్వినియోగం చేసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ సూచించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో కాకతీయ విశ్వవిద్యాలయ దూరవిద్యా అడ్మిషన్ల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కాకతీయ విశ్వ విద్యాలయ దూర విద్యా కేంద్రం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో డిగ్రీ, పీజీ కోర్సులను చదివే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ కోర్సులు పూర్తిచేసిన వారు వివిధ ఉద్యోగాలకు అర్హులుగా పరిగణించబడతారని, పారిశ్రామిక ప్రాంతానికి చెందిన నిరుద్యోగులు, నిత్యం కాలేజీకి వెళ్ళే అవకాశం లేనివారు ఈ కోర్సుల ద్వారా డిగ్రీ పట్టాలు పొందే వీలు ఉన్నట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. త్వరలో రామగుండం బీపవర్ హౌస్ ప్రారంభం కానున్నదని, ఈ ప్రాంత యువతకు ఉపాధి దొరుకుతుందని అన్నారు. ఈ సందర్భంగా 800 వాట్ల పవర్ ప్లాంట్ సాధించినందుకు గాను డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తిరుపతినాయక్, కాపంల్లి సతీష్, సుద్దాల శీను, సాగర్, రామకృష్ణ, జెట్టి రాము తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 05 , 2024 | 12:39 AM