ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిందితులను కఠినంగా శిక్షించాలి

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:36 AM

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌, ఇతర అధికా రులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు డి శ్రీని వాస్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ బొంకూరి శంక ర్‌, సెక్రెటరీ జనరల్‌ తూము రవీందర్‌ డిమాండ్‌ చేశారు.

పెద్దపల్లి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌, ఇతర అధికా రులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు డి శ్రీని వాస్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ బొంకూరి శంక ర్‌, సెక్రెటరీ జనరల్‌ తూము రవీందర్‌ డిమాండ్‌ చేశారు. వికారాబాద్‌ కలెక్టర్‌ రెవె న్యూ సిబ్బందిపై జరిగిన దాడికి నిరసనగా మంగళవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో జిల్లా రెవెన్యూ సిబ్బంది, ఉద్యోగులు వేర్వేరుగా నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డి వేణు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ వికారాబాద్‌ ఘ టన దురదృష్టకరమని, అధికారులపై దాడులు చేయడం, ప్రజలకు రెవెన్యూ సిబ్బం ది అనేక రకాలుగా అందించే సేవలను విస్మరిస్తూ, పూర్తిఅవగాహన రాహిత్యంతో భౌతిక దాడులు దిగడం దుర్మార్గమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, రెవెన్యూ సిబ్బందికి, ఇతర ఉద్యోగులందరికీ ఆత్మస్థైర్యం కల్పించాలన్నారు. అనంతరం వేర్వేరుగా కలెక్టర్‌ కోయ శ్రీహర్షకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:36 AM