ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

ABN, Publish Date - Nov 19 , 2024 | 12:29 AM

ప్రజావాణిలో స్వీకరించే దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ప్రజావాణిలో దరఖాస్తులను ఆమె స్వీకరించారు.

దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

సుభాష్‌నగర్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో స్వీకరించే దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ప్రజావాణిలో దరఖాస్తులను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సీఎం ప్రజా దర్బార్‌ లాగిన్‌లో ఉన్న అన్నిదరఖాస్తులను వచ్చే నెల ఒకటవ తేదీ వరకు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్‌ లక్ష్మికిరణ్‌, జిల్లా మైనార్టీ అధికారి పవన్‌కుమార్‌, ఏవో సుధాకర్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఫ బకాయిలను విడుదల చేయాలి

భగత్‌నగర్‌: బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, కేవీపీఎస్‌ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు ప్రజావాణిలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో సోషల్‌వెల్ఫేర్‌, గిరిజన సంక్షేమ శాఖల సహకారంతో బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం కింద దళిత, గిరిజన పిల్లలు చదువుకుంటున్నారన్నారు. ప్రతి ఏటా ఫీజులు చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 175 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందన్నారు. దీంతో దళిత, గిరిజన విద్యార్థుల చదువులకు దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి బకాయిలను విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కంపెల్లి అరవింద్‌, గజ్జెల శ్రీకాంత్‌, కేవీపీఎస్‌ నాయకులు తిప్పారపు, బోడ మోహన్‌ నాయక్‌, సురేష్‌, సందేశ్‌, తేజ పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 12:29 AM