లగచర్ల రైతులపై కేసులు ఎత్తివేయాలి
ABN, Publish Date - Dec 18 , 2024 | 12:34 AM
లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని రామ గుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.
గోదావరిఖని, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని రామ గుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు, రైతుల పట్ల వ్యవహరిస్తున్న విధా నాలను నిరసిస్తూ, రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని విడుదల చేయాలని డిమాం డ్ చేస్తూ స్థానిక మున్సిపల్ జంక్షన్‌లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి చందర్ వినతిపత్రం అందించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లగచర్ల బాధి తులకు న్యాయం చేయాలని, రైతులపై పెట్టినా కేసులు ఎత్తి వేయాలి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్‌పీటీసీ ఆముల నారాయణ, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీ నివాస్, గాధం విజయ, నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్, బొడ్డు రవీందర్, పర్లపల్లి రవి, జిమ్మిబాబు, నూతి తిరు పతి, తోకల రమేష్, సట్టు శ్రీనివాస్, పిల్లి రమేష్, కుడు దుల శ్రీనివాస్, ముద్దసాని సంధ్యారెడ్డి, యాసర్ల తిమో తి, నిట్టూరి రాజు, వడ్లూరి రాములు, వెంకన్న, ఆవునూ రి వెంకటేష్, కనకలక్ష్మి, లక్ష్మి, స్వప్న పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2024 | 12:35 AM