ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జోరు పెంచిన సీసీఐ

ABN, Publish Date - Nov 14 , 2024 | 12:31 AM

జమ్మికుంట వ్వవసాయ మార్కెట్లో కాటన్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) జోరు పెంచింది. బుధవారం 1,200 క్వింటాళ్ల పత్తి కొన్నది. అక్టోబరు 23న స్థానిక మార్కెట్‌ యార్డులో జేడీఎం శ్రీనివాస్‌ సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. 20 రోజుల వ్యవధిలో 300 క్వింటాళ్లు పత్తి మాత్రమే సీసీఐ కొన్నది.

పత్తిలో తేమ శాతాన్ని పరిశీలిస్తున్న అధికారులు

జమ్మికుంట, నవంబర్‌ 13: జమ్మికుంట వ్వవసాయ మార్కెట్లో కాటన్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) జోరు పెంచింది. బుధవారం 1,200 క్వింటాళ్ల పత్తి కొన్నది. అక్టోబరు 23న స్థానిక మార్కెట్‌ యార్డులో జేడీఎం శ్రీనివాస్‌ సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. 20 రోజుల వ్యవధిలో 300 క్వింటాళ్లు పత్తి మాత్రమే సీసీఐ కొన్నది. బుధవారం మార్కెట్‌ యార్డుకు 230 మంది రైతులు 2,335 క్వింటాళ్లు విడి పత్తి విక్రయానికి తీసుకు వచ్చారు. ప్రైవేట్‌ ట్రేడర్స్‌ బహిరంగ వేలం ద్వారా గరిష్ఠ ధర 6,950, కనిష్ఠ ధర 6,400 రూపాయలు చెల్లించి 1,135 క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేపట్టారు. 1,200 క్వింటాళ్ల పత్తిని మద్ధతు ధర ప్రకారం సీసీఐ కొన్నది. సీసీఐ సెంటర్‌ ఇన్‌చార్జి తేమ ఎక్కువగా ఉందని కొనడం లేదని పలువురు రైతులు మార్కెట్‌ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మార్కెట్‌ కార్యదర్శి ఆర్‌ మల్లేశం సీసీఐ అధికారులను వెంటపెట్టుకుని ప్రతి వాహనంలోని పత్తి తేమ శాతాన్ని పరిశీలించారు. యార్డుకు వచ్చిన 60 శాతం మేర పత్తిలో 8 శాతం నుంచి 12 శాతంలోపు మాత్రమే తేమ ఉంది. పత్తిలో తేమ శాతం తగ్గిందని, ఇకపై సీసీఐ కొనుగోళ్లు వేగవంతమవుతాయని మార్కెట్‌ కార్యదర్శి తెలిపారు.

Updated Date - Nov 14 , 2024 | 12:31 AM