కోల్‌బెల్ట్ ప్రాంతాన్ని వణికిస్తున్న చలి..
ABN, Publish Date - Nov 18 , 2024 | 12:41 AM
రెండు రోజులు గా కోల్‌బెల్ట్ ప్రాంతాన్ని చలి వణికిస్తున్నది.
కళ్యాణ్‌నగర్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : రెండు రోజులు గా కోల్‌బెల్ట్ ప్రాంతాన్ని చలి వణికిస్తున్నది. ఒకే సారి రాత్రిపూట 16డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడి పోవడంతో చలి పెరిగిపోయింది. శుక్రవారం 18 డిగ్రీలు నమోదు కాగా శనివారం రాత్రి 16డిగ్రీ లు నమోదయ్యింది. నవంబర్‌లో అత్యధికంగా చలి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొన్నది. ఉదయం కూడా చలి తీవ్ర ఎక్కువగా ఉంటుం ది. గ్రామీణ ప్రాంతాల నుంచి కూరగాయలు, పాలు తీసుకువచ్చేవారు చలిలో ఇబ్బందులు పడుతుండగా, ఉదయం షిప్టునకు వెళ్లే కార్మికు లు కూడా చలితో వణికిపోతున్నారు. రాత్రి 7 గంటలు దాటితే గోదావరిఖని పట్టణంలోని పలు కాలనీలు జనం సంచారం లేక నిర్మాను ష్యంగా మారుతున్నాయి. కొన్ని కాలనీల్లో ప్రజ లు చలిమంటలు వేసుకుంటున్నారు. నిత్యం జనంతో రద్దీగా ఉండే చౌరస్తా ప్రాంతం రాత్రి 8 గంటలు దాటితే జనం లేక వెలవెలబోతోంది.
Updated Date - Nov 18 , 2024 | 12:41 AM