ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భూములకు పరిహారం ఇప్పించాలని రైతుల ఆందోళన

ABN, Publish Date - Nov 19 , 2024 | 12:20 AM

రామగిరి మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన పలువురు రైతులు తమ నుంచి సింగరేణి తీసుకున్న భూములకు నష్టపరిహారం ఇప్పించాలని కలెక్టర్‌ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి తాము దున్నుకుంటున్న 355 ఎకరాల భూములను సింగరేణి సంస్థ ఓసీపీ 5 ప్రాజెక్టు కోసమని 2018లో లాక్కుందని చెప్పారు

కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు

- కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

పెద్దపల్లి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రామగిరి మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన పలువురు రైతులు తమ నుంచి సింగరేణి తీసుకున్న భూములకు నష్టపరిహారం ఇప్పించాలని కలెక్టర్‌ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి తాము దున్నుకుంటున్న 355 ఎకరాల భూములను సింగరేణి సంస్థ ఓసీపీ 5 ప్రాజెక్టు కోసమని 2018లో లాక్కుందని చెప్పారు. ఇక్కడ ప్రాజెక్టు చేపడుతున్నామని, అవి తమ భూములేనని సాగు చేసుకోకుండా చేశారని, పరిహారం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని అన్నారు. 2019లో మంథని రోడ్డు నిర్మించారని, 2022 జనవరిలో ఓసీపీ పనులను ప్రారంభించారని తెలిపారు. భూములకు పరిహారం ఇచ్చే విషయమై సింగరేణి అధికారులకు ఇబ్బందులకు గురి చేశారని, 2022 డిసెంబరు 30న గ్రామసభ నిర్వహించారని, గత ఏడాది ఆగస్టు 16న పరిహారం ఇస్తామని చెప్పి సంతకాలు తీసుకున్నారని తెలిపారు. ఎకరానికి 6.50 లక్షల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి, ఎన్నికల కోడ్‌ పేరిట ఏడాదిన్నరగా తాత్సారం చేశారన్నారు. నవంబరు 4న గ్రామంలో కమిటీ వేసి భూముల జాబితా తయారు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా కమిటీ వేయలేదని అన్నారు. సింగరేణి సంస్థ అధికారులు తమ భూములను తీసుకుని పరిహారం ఇవ్వకుండా ఐదేళ్లుగా తమ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు తమ భూములకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

Updated Date - Nov 19 , 2024 | 12:20 AM