ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డీఈవోను సస్పెండ్‌ చేసి విచారణ జరపాలి

ABN, Publish Date - Nov 14 , 2024 | 12:29 AM

డీఈవో సీహెచ్‌వీఎస్‌ జనార్దన్‌రావు ను సస్పెండ్‌ చేసి, ఆయనపై రాష్ట్రస్థాయి అధికారితో విచారణ జరిపించాలని డీటీఎఫ్‌, టీపీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

గణేశ్‌నగర్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): డీఈవో సీహెచ్‌వీఎస్‌ జనార్దన్‌రావు ను సస్పెండ్‌ చేసి, ఆయనపై రాష్ట్రస్థాయి అధికారితో విచారణ జరిపించాలని డీటీఎఫ్‌, టీపీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. డీఈవో వైఖరికి నిరసనగా ఆ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి మాట్లాడుతూ 317 జీవో అమలు, బదిలీలు, పదోన్నతుల సందర్భంలో డీఈవో అవకతవకలకు పాల్పడి ఉపాధ్యాయులకు నష్టం కలిగించారన్నారు. పాఠశాలల పర్యవేక్షణ పేరుతో ఉపాధ్యాయులను వేధిస్తున్నారని ఆరోపించారు. చిన్న విషయాలకే మెమోలు, షోకాజ్‌ నోటీసులు ఇచ్చి సస్పెండ్‌ చేస్తున్నారని విమర్శించారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి డీఈవోపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. టీపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి మాడుగుల రాములు మాట్లాడుతూ డీఈవో వైఖరితో ఉపాధ్యాయులు వేదనకు గురవుతున్నారన్నారు. డీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైద్యుల రాజిరెడ్డి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఎంఈవోల కమిటీ నిర్ణయాల ప్రకారం ఏడుగురు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారన్నారు. కార్యక్రమానికి డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి, టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జంకె రామచంద్రారెడ్డి, డీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి తూముల తిరుపతి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అటుకుల శ్రీనివాస్‌రెడ్డి, పలకల ఈశ్వర్‌రెడ్డి, బి సదానందం, డి ఏసురెడ్డి, ఎం రఘుశంకర్‌రెడ్డి, నారాయణరెడ్డి, కె రాజమౌళి, ఎ దామోదర్‌, సీహెచ్‌ రామ్మోహన్‌, సముద్రాల అంజయ్య, ఎ శ్రీనివాస్‌, ఎం రాంకిషన్‌రావు, ఎ సంతోష్‌రెడ్డి, శ్రీహరి, ఎ రాంరెడ్డి, ఎ నరేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 12:29 AM