ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధిహామీ పథకాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలి

ABN, Publish Date - Oct 24 , 2024 | 12:48 AM

జిల్లాలో మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకాన్ని సంపూర్ణంగా వినియోగించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నా రు.

పెద్దపల్లి, అక్టోబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకాన్ని సంపూర్ణంగా వినియోగించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నా రు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉపాధిహామీ పనుల పురోగతిపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 100 రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న జాబ్‌ కార్డు కుటుంబాలు తక్కువగా నమోదు అవుతున్నాయని, ప్రస్తుత సంవత్సరం కేవలం 360 మాత్రమే జరిగాయన్నారు. మన పనితీరు చాలా తక్కువగా ఉందని కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో గత సంవత్సరం కంటే కనీ సం 40శాతం అధికంగా కుటుంబాలకు 100 రోజుల పని ఆర్థిక సంవత్సరం ముగిసే సమ యానికి కల్పించాలని, దానికి తగిన విధంగా పనులను గుర్తించి గ్రామ సభలను వెంటనే నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. మన గ్రామంలో సరాసరి వేజ్‌ 181 కంటే తక్కువ వచ్చే పనులు చేపట్టవద్దన్నారు. గ్రామంలో 4,5 లొకేషన్లలో క్వాలిటీ పనులు జరగాలని, ఈ పనులు 100 రోజుల వరకు వండే విధంగా ప్లాన్‌ చేసుకోవాలని సూచించారు. గత సంవత్సరం కంటే సరాసరి వేతనం కనీసం 20 శాతం పెంచడం లక్ష్యంగా పని చేయాలని అన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఎ కె రవీందర్‌, జడ్పీసీఈవో నరేందర్‌, ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజాభిప్రాయ కార్యక్రమాల నిర్వహణకు పక్కా చర్యలు

- బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌

సమగ్ర కులాల స్థితిగతులు తెలుసుకునేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా చేపట్టిన ప్రజాభిప్రాయ కార్యక్రమాల నిర్వహణకు పక్కా చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ అన్నారు. బుధవారం బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ , బీసీ కమిషనర్‌ బాల మాయదేవితో కలిసి జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషణ జరపాలని ఉద్దేశంతో ప్రభుత్వం సమగ్ర కులాల సర్వే చేపట్టిందని అన్నారు. కులగణన కేంద్రం పరిధిలో ఉందని తెలిపారు. బీసీలే కాకుం డా మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ మొదలగు అన్ని కులాల సమగ్ర వివరాలు సర్వే నిర్వహిస్తు న్నామని అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం కమిషన్‌ పర్యటనకు సంబంధించిన వివరాలు విస్తృతంగా ప్రచారం కల్పించాలని, కమిషన్‌ పర్యటించే ప్రాంతం, ప్రజాభి ప్రాయ సేకరణ ఎక్కడ జరుగుతుందనే వివరాలు, ఉమ్మడి జిల్లా పరిధిలోని ఏ జిల్లా ప్రజలు ఏ సమయంలో రావాలి షెడ్యూల్‌ నిర్ధారించి ఆ వివరాలు ప్రింట్‌ ఎలకా్ట్రనిక్‌ మీడి యా, సామాజిక మీడియా ద్వారా ప్రచారం చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలకు సంబంధించి నవంబర్‌ 1న నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఈ కార్యక్రమానికి పెద్దపల్లి నుంచి అన్ని కుల సంఘాలు, వర్గాల ప్రజలు, సంచార జాతుల వారు హాజరయ్యే విధం గా విస్తృతంగా ప్రచారం కల్పిస్తామని అన్నారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారు లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2024 | 12:49 AM