ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వారధి కోసం పోరుబాట

ABN, Publish Date - Nov 12 , 2024 | 01:08 AM

దిగువ మానేరు రిజర్వాయర్‌ (ఎల్‌ఎండీ) నిర్మాణం కోసం తమకు జీవనాధారమైన భూములను ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇచ్చారు.

మానేరుపై వంతెన నిర్మించాలని డిమాండ్‌

- జేఏసీగా ఏర్పడ్డ మూడు మండలాల ప్రజలు

- జిల్లా కేంద్రంలో ఏడుగంటలపాటు దీక్ష

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

దిగువ మానేరు రిజర్వాయర్‌ (ఎల్‌ఎండీ) నిర్మాణం కోసం తమకు జీవనాధారమైన భూములను ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇచ్చారు. మిగిలిన భూమిలో వ్యవసాయం చేస్తూ భూమిలేని వారు ఇతర వృత్తులను ఆధారం చేసుకొని జీవిస్తున్నారు. ప్రభుత్వం నిర్మించిన ఈ రిజర్వాయర్‌ కారణంగా వారికి ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. రిజర్వాయర్‌ నిర్మాణంతో మూడు మండలాలకు మూలాధారమైన రోడ్డు నీటిలో మునిగింది. ఈ కారణంగా వారు దూరభారమైన ప్రయాణం చేస్తూ జిల్లా కేంద్రానికి చేరుకోవలసిన పరిస్థితి ఉత్పన్నమైంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి విద్యనభ్యసించడం కష్టసాధ్యంగా మారడంతో కొందరు విద్యార్థులు చదువు మానేయాల్సిన పరిస్థితి. ఆరోగ్యం విషమిస్తే సకాలంలో వైద్యం అందే అవకాశం లేని పరిస్థితిని ఆ మండలాల ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఏళ్ల తరబడి అధికారులు, ప్రజాప్రతినిధులను కలుస్తూ మానేరుపై వంతెన నిర్మాణం చేయమని కోరుతున్నా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు ఈ మండలాల ప్రజలు జేఏసీగా ఏర్పడి మానేరు వంతెన సాధన కోసం ఉద్యమిస్తున్నారు.

ఫ మూడు మండలాలకు ప్రయోజనం

మానేరు వంతెన సాధన జేఏసీ ఆధ్వర్యంలో మండలాల స్థాయిలో పలు ఆందోఽళనలు చేపట్టిన ప్రజలు ప్రభుత్వం నుంచి కదలిక లేక పోవడంతో తమ ఆందోళన వేదికను జిల్లా కేంద్రానికి మార్చుకున్నారు. సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో బెజ్జంకి, ఇల్లంతకుంట, గన్నేరువరం మండలాలకు చెందిన ప్రజలు కలెక్టరేట్‌ ఎదుట ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్షను చేపట్టారు. లోయర్‌ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ) నిర్మాణం కోసం ఈ మూడు మండలాలకు చెందిన ప్రజలు వేలాది ఎకరాలను ఇచ్చారు. డ్యాం నిర్మాణంతో గన్నేరువరం మండలం నుంచి జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే 40 కిలోమీటర్లు, బెజ్జంకి నుంచి కరీంనగర్‌కు చేరుకోవడానికి 45, ఇల్లంతకుంట నుంచి వస్తే 50 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డ్యాం బ్యాక్‌ వాటర్‌ ఉండే లారెల్స్‌ పాఠశాల వెనుక ప్రాంతం నుంచి గన్నేరువరం వరకు నదిపై మైసమ్మగుట్ట వరకు 1.25 కిలోమీటర్ల మేర బ్రిడ్జి నిర్మిస్తే గన్నేరువరం ప్రజలు తొమ్మిది కిలో మీటర్లు, బెజ్జంకి ప్రజలు 20 కిలోమీటర్లు, ఇల్లంతకుంట ప్రజలు 23 కిలోమీటర్లు ప్రయాణిస్తే జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి వీలుకలుగుతుంది. ఈ మండలాల్లోని 120 గ్రామాల ప్రజలకు బ్రిడ్జి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఫ పర్యాటకంగా అభివృద్ధికి అవకాశం

బ్రిడ్జి నిర్మాణంతో మైసమ్మ గుట్ట వద్ద డ్యాం బ్యాక్‌ వాటర్‌లో మునగని మూడు వేల ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిని ప్రభుత్వం వివిధ అవసరాలకు వినియోగించుకోవడానికి వీలు కలుగుతుంది. మైసమ్మ గుట్టను పర్యాటక కేంద్రంగా మార్చి ప్రభుత్వం ఆదాయం పొందే అవకాశం ఉంది. గతంలో ఈ గుట్టను కేంద్రంగా చేసుకొని బోట్‌ నడిపేందుకు సర్వే నిర్వహించారు. గన్నేరువరం మండలంలోని కాసీంపేటలో మానసాదేవి ఆలయం ఉంది. ఈ ఆలయానికి రోజు వందలాది మంది భక్తులు వస్తుంటారు. మానేరు మీదుగా వంతెన నిర్మిస్తే ఆలయానికి వెళ్లే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. మూడు మండలాల ప్రజలకు ఉపయోగంగా ఉండే ఈ వంతెన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ దూరం తగ్గుతుంది...

వరాల పర్శరాములు, మైలారం, గన్నేరువరం మండలం

మేము ప్రతి రోజు కరీంనగర్‌కు వస్తుంటాం. ప్రస్తుతం కరీంనగర్‌కు రావాలంటే 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. అన్నింటినికి దూరంగా ఉండడం వల్ల విద్య, వైద్యం అందడం లేదు. బ్రిడి నిర్మిస్తే 32 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.

ఫ ఇబ్బందులు తొలగుతాయి...

గాదం స్వామి, బెజ్జంకి మండలం

బ్రిడ్జీ నిర్మిస్తే మా ఇబ్బందులు తొలగుతాయి. బ్రిడ్జి లేక 36 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. బ్రిడ్జీ నిర్మిస్తే మాకు 20 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. విద్యార్థులు, వైద్యం కోసం కరీంనగర్‌కు వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు.

ఫ పంట అమ్మితే సగం డబ్బులు రవాణాకే...

- రాగటి రాజారత్నం, నర్సక్కపేట, ఇల్లంతకుంట మండలం

మా మండలంలో చాలా గ్రామాల్లో కూరగాయలు పండిస్తుంటాం. వాటిని కరీంనగర్‌ మార్కెట్‌కు తీసుకువస్తాం. దూరం ఎక్కువగా ఉండడం వల్ల కూరగాయలు అమ్మగా విచ్చిన దాంట్లో సగం రవాణాకే ఖర్చవుతోంది. బ్రిడ్జి నిర్మిస్తే దూరం తగ్గడంతోపాటు ఖర్చులు తగ్గుతాయి.

ఫ మానేరుపై బ్రిడ్జి నిర్మించాలి..

సుభాష్‌నగర్‌: గన్నేరువరం, ఇల్లంతకుంట, బెజ్జంకి మండలాల ప్రజల సౌకర్యార్థం మానేరుపై బ్రిడ్జి నిర్మించాలని జేఏసీ నాయకులు కోరారు. సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట దీక్ష నిర్వహించారు. దీక్షలో జేఏసీ చైర్మెన్‌ సంపతి ఉదయ్‌, పురంశెట్టి బాలయ్య, గంప వెంకన్న, గువ్వ వీరయ్య, జక్కనపల్లి గణేశ్‌, జక్కనపల్లి వీరయ్య, కుమ్మరి సంపత్‌, సీపీఐఎంఎల్‌ నాయకులు బామండ్ల రవీందర్‌, వరాల పరశురాములు, మర్రి వెంకటమల్లు, తోట కోటేశ్వర్‌, విలాసాగరం రామచంద్రం పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 01:08 AM