ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బీసీల అభ్యున్నతికి డెడికేషన్‌ కమిటీ ఏర్పాటు హర్షణీయం

ABN, Publish Date - Nov 08 , 2024 | 12:41 AM

సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబాటుతనానికి గురైన బీసీలకు రాజ్యాంగబద్దంగా కల్పించాల్సిన రిజర్వేషన్‌ సౌకర్యాల కోసం డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి అన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

- వెనుకబడిన వర్గాల్లో ఆశలు చిగురింపజేస్తున్న కులగణన సర్వే

- ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి

జగిత్యాల అగ్రికల్చర్‌, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబాటుతనానికి గురైన బీసీలకు రాజ్యాంగబద్దంగా కల్పించాల్సిన రిజర్వేషన్‌ సౌకర్యాల కోసం డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బలహీన వర్గాల అభ్యున్నతిలో భాగంగా రాజ్యాంగబద్దంగా రాష్ట్ర ప్రభుత్వం డెడికేషన్‌ కమిటీ వేసిందన్నారు. బలహీనవర్గాలకు స్థానికసంస్థల్లో రిజర్వేషన్ల కల్పనకు ఉమ్మడి రాష్ట్రంలోనే చట్టం రూపొందించారన్నారు. 2004లో యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఆలోచనలకు అనుగుణంగా అల్పసంఖ్యాక వర్గాలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పించారన్నారు. బలహీనవర్గాల న్యాయం చేయాలనే తలంపుతోనే రాహుల్‌ గాంధీ వివరాలు సేకరించేందుకు సర్వే చేయాలని ఆదేశించారన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లోనే కులగణన అంశం ప్రస్తావించడంతో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సర్వేతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎంకు లేఖ రాశానని అందులో సర్వే చేసే రోజు సమాచారం ఉండేలా చూడాలని కోరానన్నారు. కొందరికి ఇంటి నంబర్లు లేక బయట గుడిసెలు వేసుకోని ఉన్నారని, కొందరు సంచార జాతులు కూడా ఉన్నారని అలాంటి వారిపై కూడా ప్రత్యేక దృష్టి సారించి స్పష్టమైన వివరాలు సేకరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సర్వేకు ప్రజలు అందుబాటులో ఉండి సహకరించాలని కోరారు. గత ప్రభుత్వం 2014లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే నేటీకీ బహిర్గతం కాలేదన్నారు. ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వం పారదర్శకత, చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. పనిచేసే ప్రభుత్వంపై అక్కసుతోనే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజం అన్నారు. నవంబరు నెలలోనే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని, గ్రామసభల ద్వారా అర్హులను ఎంపిక చేసి నిర్ణయం తీసుకుంటారన్నారు. సర్వేపై ప్రజలు ఆపోహలు, ఆందోళన చెందవద్దన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ చైౖర్‌పర్సన్‌ అడువాల జ్యోతిలక్ష్మణ్‌, టీపీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌, మండల బ్లాక్‌ ప్రెసిడెంట్‌ నందయ్య, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ దుర్గయ్య, మాజీ ఎంపీపీ రమేష్‌, మాజీ కౌన్సిలర్లు గాజుల రాజేంధర్‌, పుప్పాల అశోక్‌, నాయకులు నెహాల్‌, చాంద్‌పాషా, గుండామధు, విజయ్‌, మహేష్‌ తదితరులున్నారు.

Updated Date - Nov 08 , 2024 | 12:41 AM