ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కేంద్రాల్లోని ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించాలి

ABN, Publish Date - May 18 , 2024 | 12:01 AM

కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని వెంటవెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ అధికారులకు ఆదేశించారు.

కేంద్రాన్ని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌

రుద్రంగి, మే 17: కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని వెంటవెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ అధికారులకు ఆదేశించారు. రుద్రంగి మండల కేంద్రంలోని సింగిల్‌ విండో కొనుగోలు కేంద్రాలను, మానాల, సమీపంలోని తండాల వద్ద ఉన్న కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌ శుక్రవారం పరిశీలించారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని తడవకుండా టార్పాలిన్లు కప్పాలన్నారు. లారీల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని రైస్‌ మిల్లు, వేములవాడ రూరల్‌ మండలం మర్రిపల్లి రైస్‌ మిల్లును పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ రైస్‌ మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా దించుకోవాలని, ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్‌ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌ జితేంద్ర ప్రసాద్‌, తహసీల్దార్లు శ్రీలత, అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2024 | 12:01 AM

Advertising
Advertising