ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి

ABN, Publish Date - Sep 12 , 2024 | 12:18 AM

తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు డిమాండ్‌ చేశారు. మండలంలోని గాలిపెల్లిలో బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభమ య్యాయి. బద్దం ఎల్లారెడ్డి స్తూపం వద్ద నివాళులు అర్పించారు. విగ్రహానికి పూలమాలలు వేశారు.

బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేస్తున్న సీపీఐ నాయకులు

ఇల్లంతకుంట, సెప్టెంబరు 11: తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు డిమాండ్‌ చేశారు. మండలంలోని గాలిపెల్లిలో బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభమ య్యాయి. బద్దం ఎల్లారెడ్డి స్తూపం వద్ద నివాళులు అర్పించారు. విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడారు. తెలంగాణ నిజాం సర్కార్‌ మెడలు వంచాలని బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, ముగ్దుంమొయినుద్దీన్‌ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారన్నారు. ఈ పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టు గెరిల్లాలు అమరత్వం పొందాయని, 300 గ్రామాలకు నిజాం పాలన నుంచి విముక్తి లభించా యని అన్నారు. భూస్వాములు, జమీందారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వక్రీకరిస్తోందని, హిందూ, ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా పేర్కొంటోందని అన్నారు. ఓట్ల రాజకీయం చేస్తున్న బీజేపీని అన్నివర్గాల ప్రజలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఘనత కమ్యూనిస్టులదేనన్నారు. సిరిసిల్లలో బద్దం ఎల్లారెడ్డి, సింగిరెడ్డి భూపతిరెడ్డి కాంస్య విగ్రహాని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 17వరకు సాయుధ పోరాట వారోత్సవాలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గసభ్యుడు మంద సుదర్శన్‌, నాయకుడు కడారి రాములు, మీసం లక్ష్మణ్‌, వేణు, శ్రావణపెల్లి మల్లేశం, ఏసీరెడ్డి, తిరుపతిరెడ్డి, లక్ష్మన్‌, రాజు, బాలయ్య, చంద్రం, బాలనర్సు, బాలమల్లు, బద్దం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:18 AM

Advertising
Advertising