ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గత ప్రభుత్వం 40 వేల కోట్ల బిల్లులు బకాయి పెట్టింది

ABN, Publish Date - Oct 12 , 2024 | 12:32 AM

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 40 వేల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టిందని, అందకే ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం తిమ్మాపూర్‌ మండల కేంద్రంలోని యాదవులపల్లిలో సమీకృత గురుకుల పాఠశాల సముదాయ భవనం నిర్మాణానికి శంకుస్ధాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తిమ్మాపూర్‌ యాదవుల పల్లెలో ఇంటిగ్రేటెడ్‌ గురుకుల పాఠశాలకు పనులకు శంకుస్ధాపన చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

తిమ్మాపూర్‌, అక్టోబరు 11: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 40 వేల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టిందని, అందకే ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం తిమ్మాపూర్‌ మండల కేంద్రంలోని యాదవులపల్లిలో సమీకృత గురుకుల పాఠశాల సముదాయ భవనం నిర్మాణానికి శంకుస్ధాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా, వైద్యం, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేనాటిని ఇక్కడ అన్ని హంగులు, వసతులతో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల భవనాలను ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 28 యంగ్‌ ఇండియా ఇంటిగ్రేడ్‌ గురుకుల పాఠశాలలకు ప్రభుత్వం ఐదు వేల కోట్లు కేటాయించిందన్నారు. కేసీఆర్‌ బిడ్డ కవితకు, బంధువు వినోద్‌కుమార్‌కు మాత్రం పదవి ఊడిపోయి ఆరు నెలలు గడవక ముందే పదవులిచ్చిన గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందని ప్రశ్నించారు. 1100 కోట్లతో ఆమ్మ ఆదర్శ పాఠశాలలను తీర్చి దిద్దామన్నారు. పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యను బట్టి ఉపాద్యాయులు ఉండాలని అవసరం మేర డిప్యుటేషన్లు ఇవ్వలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలతో కొందరు రైతులకు రుణమాఫీ వర్తించలేదని తెలిపారు. రెండు లక్షలకు పైన రుణం తీసుకున్న రైతులు అదనపు మొత్తాన్ని చెల్లించిన అనంతరం రుణమాఫీ అవుతుందన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మానకొండూర్‌ నియోజకవర్గానికి యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ రావడానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక పాత్ర పోషించారన్నారు. వచ్చే జూన్‌లో అకాడమిక్‌ ఇయర్‌ ప్రారంభించేలా ఈ ఇంటిగ్రేడెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ వేగంగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్‌ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు ప్రపుల్‌దేశాయ్‌, లక్ష్మీ కిరణ్‌, ఆర్డీవో మహేశ్వర్‌, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, నాయకులు శ్రీగిరి రంగారావు, ఎస్‌ఎల్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2024 | 12:33 AM