రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..
ABN, Publish Date - Nov 30 , 2024 | 12:16 AM
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాగూర్ అన్నారు.
అంతర్గాం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాగూర్ అన్నారు. శుక్రవారం అంతర్గాం మండల పరిధిలోని గోలివాడ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఈ మేరకు మాట్లాడారు. తూకంలో ఎటువంటి కోత లు విధించకుండా వరి ధాన్యం కొనుగోలు జర పాలని అధికారులను, కొనుగోలు కేంద్రం నిర్వా హకులను ఆదేశించారు. రైతులు పండించిన సన్నరకం వరి పంటకు ఈ సీజన్ నుంచే రూ. 500 బోనస్ చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. గతం లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తూకంలో కోతలు విధించి రైతులను ఆర్థికంగా నష్టపరిచిందని విమర్శించారు. రైతుల కళ్లల్లో ఆనందం చూడ టమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం ఎల్లంపల్లి వద్ద గల కస్తూర్భా గాంధీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల కు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. విద్యా ర్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమై న భోజనాన్ని అందించాలని విద్యాలయం ప్రత్యే క అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎండీ అలీం, కాంగ్రెస్ నాయకులు పెండ్రు హనుమాన్‌రెడ్డి, ఉరిమెట్ల రాజలింగం, పూదరి సత్తయ్యగౌడ్, ఆవుల గోపాల్‌యాదవ్, మడ్డి తిరుపతిగౌడ్, సింగం కిరణ్‌గౌడ్, గౌస్, ఇండబిల్లి రవీందర్ పాల్గొన్నారు.
Updated Date - Nov 30 , 2024 | 12:16 AM