ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ధాన్యంలో కోత విధిస్తే క్షమించేది లేదు

ABN, Publish Date - Oct 24 , 2024 | 12:50 AM

రైతులు ఆర్థికంగా కష్టాలకోర్చి పండించిన ధాన్యంలో మిల్లర్లు గాని కొనుగోలు కేంద్రాల నిర్వహకులు గాని దాన్యంలో కోత విధిస్తే ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.

ఓదెల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : రైతులు ఆర్థికంగా కష్టాలకోర్చి పండించిన ధాన్యంలో మిల్లర్లు గాని కొనుగోలు కేంద్రాల నిర్వహకులు గాని దాన్యంలో కోత విధిస్తే ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. మండలంలోని గుంపుల, రూపునారాయణపేట, పొత్కపల్లి, ఓదెలలో వ్యవ సాయ సహకార సంఘం, సెర్ఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మె ల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఓదెల లో మాట్లాడుతూ, దాన్య కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే రైతులకు ట్రక్‌ షీట్స్‌ వెంటనే ఇవ్వాలని,అలాగే మిల్లుల్లో ధాన్యం దిగుమతి అయ్యేవరకు కేంద్రాల నిర్వహకులదే బాధ్యత ఉంటుందని, తూకం అయిన తర్వాత రైతులకు ధాన్యం కేంద్రాలతో ఎలాంటి సంబం ధం ఉండదని, రైతులను బాధ్యులను చేయవద్ద ని తెలిపారు. ధాన్యం బిల్లులకు తరలించిన త ర్వాత మిల్లుల వద్దకు రైతులను తీసుకువెళ్ళవద్ద ని అన్నారు. రైతులు ప్రభుత్వ నిబంధనల ప్రకా రం నాణ్యతను పాటించాలని, కేంద్రాల నిర్వాహ కులతో సమన్వయంగా వ్యవహరించాలని కోరా రు. రైతులకు ఇబ్బందులు ఎదురైతే స్వయంగా నేనే ముందుండి మిల్లుల వద్ద ధాన్యాన్ని దింపి స్తానని భరోసా ఇచ్చారు. సన్న రకాల ధాన్యానికి రూ,ఐదు వందల బోనస్‌ ఉంటుందని, ఈ విష యంలో ఎలాంటి అపోహలకు గురికావద్దని తెలి పారు. మండలంలోని అన్ని ధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రతివారం సందర్శించి తనిఖీలు నిర్వహించాలని తహసీల్దార్‌ యాకయ్యను ఎమ్మె ల్యే ఆదేశించారు. అలాగే గత ప్రభుత్వంలో ప్రతి క్వింటాల్‌ ధాన్యంలో 20కిలోల చొప్పున ధాన్యాన్ని దోచుకోని కోట్లాది రూపాయలు అక్రమంగా సం పాదించారని, ఇప్పుడు గింజ కూడా వృధా కావ డానికి వీలులేదని, రైతులు పండించిన ధాన్యా ఫలితాలు రైతులే అనుభవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్‌ సాగర్‌ రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ ఆళ్ళ సుమన్‌రెడ్డి, నాయకులు తిప్పారపు సంప త్‌, సంద మహేందర్‌, గిరాం సాంబమూర్తి, పడాల రాజు, సిరిసేటి రాహుల్‌, చీకట్ల మొండ య్య, అంకం రమేష్‌, ఆకుల మహేందర్‌, బోడ కుంట శంకర్‌, చింతం కుమారస్వామి, నాగపూరి రవి గౌడ్‌, బోడకుంట స్వామి, కోట నిరంజన్‌ రెడ్డి, చొప్పరి రాజయ్య, రెడ్డి రజనీకాంత్‌, బొంగో ని శ్రీనివాస్‌, నీర్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2024 | 12:50 AM