ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సర్వేలో తప్పులు లేకుండా చూడాలి

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:36 AM

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో తప్పులు లేకుండా చూడాలని, ఎన్యూమరేటర్లు అంకితభావంతో పని చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో 17, 28 వార్డుల్లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల ఇంటింటి సర్వేను పరిశీలించారు.

సర్వేను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

సిరిసిల్ల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో తప్పులు లేకుండా చూడాలని, ఎన్యూమరేటర్లు అంకితభావంతో పని చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో 17, 28 వార్డుల్లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల ఇంటింటి సర్వేను పరిశీలించారు. సమాచారం ఇవ్వడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని పలు కుటుంబాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే ప్రక్రియలో ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వివరాలు తీసుకోవాలని అన్నారు. సర్వేపై ప్రజలకు సందేహాలు ఉంటే ఎన్యూమరేటర్లు నివృత్తి చేయాలన్నారు. ప్రజలు అపోహలకు పోకుండా సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచిం చారు. అన్ని కుటుంబాల వివరాల సేకరణ సమగ్రంగా తీసుకో వాల న్నారు. సర్వేను అధికారులు తనిఖీ చేయాలన్నారు. ఆయన వెంట సిరిసిల్ల ఆర్డీవో వెంకట ఉపేందర్‌ రెడ్డి, కమిషనర్‌ లావణ్య ఉన్నారు.

సకాలంలో సర్వే పూర్తి చేసేలా కార్యాచరణ

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియ జిల్లాలో సకాలంలో పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేయాలని, ప్రతీరోజు నిర్ధిష్ట లక్ష్యం మేరకు సర్వే జరగాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదే శించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమగ్ర సర్వేపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. జిల్లాలో 1531 బ్లాక్‌లలో 1,92,432 ఇళ్ల సర్వే చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు 49,918 ఇళ్ల పూర్తయ్యిందన్నారు. 26 శాతం వరకు సర్వే జరిగిందని, గంభీరావుపేట, ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేట, బోయినపల్లి మండలాల్లో సర్వే నిర్వహణలో వేగం పెంచాలని సూచించారు. సూపర్‌వైజర్లు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ టీచర్ల స్థానంలో రిజర్వ్‌ సిబ్బందిని వినియోగించు కోవాలన్నారు. ప్రజల నుంచి స్వచ్ఛందంగా సమాచారం తీసుకోవాలని, బలవంతం చేయవద్దని అన్నారు. సర్వే కారణంగా పథకాలు కోల్పోరని ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, సీపీవో శ్రీనివాసచారి, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకట ఉపేందర్‌రెడ్డి, రాజేశ్వర్‌, కమిషనర్‌ లావణ్య, డీఆర్డీవో శేషాద్రి, జడ్పీ సీఈవో వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

అపోహలు నమ్మొద్దు

వీర్నపల్లి : సోషల్‌ మీడియాలో వచ్చే అపోహలను ప్రజలు నమ్మొద్దని, సర్వేకు స్వచ్ఛందంగా సహకరించాలని తహసీల్దార్‌ మారుతి రెడ్డి కోరారు. వీర్నపల్లి మండల కేంద్రంతోపాటు బాబాయ్‌ చెర్వు తండా, రాశిగుట్ట తండాలో సమగ్ర కుటుంబ సర్వేను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే చేస్తున్న సిబ్బందికి తప్పులు లేకుండా వివరాలు అందిం చాలన్నారు. అనంతరం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దని ఆదేశించారు.

Updated Date - Nov 13 , 2024 | 12:36 AM