ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రామగుండం అభివృద్ధిలో పాలుపంచుకోవాలి

ABN, Publish Date - Nov 17 , 2024 | 12:14 AM

రామ గుండం నగర అభివృద్ధిలో ప్రజలకు సేవలందిం చడంలో పరిశ్రమలు పాలుపంచుకోవాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, కలెక్టర్‌ శ్రీహర్ష కోరారు.

కోల్‌సిటీ, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): రామ గుండం నగర అభివృద్ధిలో ప్రజలకు సేవలందిం చడంలో పరిశ్రమలు పాలుపంచుకోవాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, కలెక్టర్‌ శ్రీహర్ష కోరారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్‌ అనీల్‌ కుమార్‌, ఇన్‌ చార్జి కమిషనర్‌, అదనపుకలెక్టర్‌ అరుణశ్రీ, సింగ రేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, ఎన్‌పీడీసీఎల్‌ నగరపాలక అధికారులతో వారు సమీక్ష సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మాట్లాడు తూ పరిశ్రమలు కేవలం తమ క్వార్టర్లలోని పారిశుధ్యం, వీధి దీపాలు నిర్వహిస్తున్నారని, పక్కన ఉన్న కాలనీలు, ప్రభావిత ప్రాంతాలను పట్టించుకోవడం లేదన్నారు. పరిశ్రమలు తమ ఆధీనంలోని ప్రాంతాల ను మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఇచ్చి నిర్వహణకు నిధులన్నా ఇవ్వాలని లేదా పూర్తిస్థాయిలో పరిసర ప్రాంతాల్లోని పారిశుధ్యం, వీధిదీపాల నిర్వ హణ అయినా చేపట్టాలని సూచించారు. సమీక్ష సమావేశాలకు పరిశ్ర మల ఉన్నతాధికారులు రాకుండా కింది స్థాయి అధికారులను పంపించ డం వల్ల వారికి సమస్యలు, పరిష్కారాలపై అవగాహన ఉండడం లేద న్నారు. ఇప్పటికే ఈ విషయాలపై పరిశ్రమల ఉన్నతాధికారులతో కూడా మాట్లాడామన్నారు. వెంటనే సమీప కాలనీల్లో పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ చేపట్టాలన్నారు. ఇందుకు పరిశ్రమల అధికారులు సానుకూ లంగా స్పందించారు. పరిశ్రమలు కార్పొరేషన్‌కు సీఎస్‌ఆర్‌ నిధులు మం జూరు చేయాలన్నారు. నగరంలోని వివిధ కూడళ్లను అభివృద్ధి చేస్తున్నా మని, ఇందుకు విద్యుత్‌ స్థంబాలు, టవర్లను తొలగించాలని ఎమ్మెల్యే సూచించారు. కలెక్టర్‌ శ్రీహర్ష మాట్లాడుతూ పరిశ్రమలు తమ పరిసర కాలనీల్లో చేపట్టబోయే పారిశుధ్య పనులకు సంబంధించి వచ్చే శని వారం పూర్తిస్థాయి నివేదికలు సమర్పించాలన్నారు. ఆయా కాలనీలకు పారిశుధ్య నిర్వహణ బాధ్యులు వాహనాల గురించి కూడా తెలియజే యాలన్నారు. నగరంలో విద్యుత్‌ లైన్లు, స్తంభాలు అస్తవ్యస్థంగా ఉంటు న్నాయని, వాటిని మార్చేందుకు అవసరమైన అంచనాలు తయారు చేసి తమకు సమర్పించాలన్నారు. అలాగే కొత్త వీధి దీపాల కోసం వేసిన లైన్లకు విద్యుత్‌ సరఫరా చేయాలని ఎన్‌పీడీసీఎల్‌ అధికారులను ఆదే శించారు. పారిశుధ్య నిర్వహణకు సంబంధించి నగరపాలక సంస్థతలో సమన్వయంతో పని చేయాలని, తడిచెత్త, పొడిచెత్తను వేరు చేసి రీ సైక్లింగ్‌ చేయాలన్నారు. టీయూఎఫ్‌ఐడీసీ పనుల్లో వేగం పెంచాలని, పని చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో తహసిల్దార్‌ కుమారస్వామి, ఎస్‌ఈ శివానంద్‌, సింగరేణి అధికారులు వర ప్రసాద్‌, జితేందర్‌సింగ్‌, ఎర్రన్న, ఎన్‌టీపీసీ అధికారులు సూర్యనారాయణ, ప్రవీణ్‌ చౌదరి, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికా రులు వెంకటరెడ్డి, హరికృష్ణ, ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు ప్రభాకర్‌, శ్రీని వాస్‌, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 12:14 AM