ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నేడు రంజాన్‌

ABN, Publish Date - Apr 10 , 2024 | 11:55 PM

రంజాన్‌ను జిల్లా వ్యాప్తంగా ముస్లింలు గురువారం జరుపుకోనున్నారు. బుధవారం రాత్రి నమాజుల అనంతరం నెలవంక కనిపించడంతో రంజాన్‌ మాస ముగింపు సూచకంగా భావించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

కరీంనగర్‌ కల్చరల్‌, ఏప్రిల్‌ 10: రంజాన్‌ను జిల్లా వ్యాప్తంగా ముస్లింలు గురువారం జరుపుకోనున్నారు. బుధవారం రాత్రి నమాజుల అనంతరం నెలవంక కనిపించడంతో రంజాన్‌ మాస ముగింపు సూచకంగా భావించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నెల రోజుల దీక్ష ముగించి మరుసటి రోజు ప్రత్యేక సామూహిక నమాజ్‌ చేసి శుభాకాంక్షలు తెలుపుకుంటారు.

ఫ నేడు ఈద్గాల్లో నమాజు, సందేశాల వివరాలు

ఎండ తీవ్రత దృష్ట్యా నగరంలోని, నగర శివారులోని పలు ఈద్గా మైదానాల్లో గురువారం ఉదయం 9 నుంచి 10 గంటల లోపే సామూహిక ప్రార్థనలు ప్రారంభం కానున్నాయి. వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌ వద్ద గల పురానీ (ఖదీమ్‌షాహి) ఈద్గాలో 9 గంటలకు సయ్యద్‌ షా మొహమ్మద్‌ ఖాద్రి నమాజ్‌ చేయించి సందేశమివ్వనున్నారు. చింతకుంట ఈద్గాలో 9 గంటల నుంచి ముఫ్తి ఎత్తెమాదుల్‌హక్‌ నమాజ్‌ చేయించనుండగా మొహమ్మద్‌ ఖైరొద్దీన్‌ సందేశమివ్వనున్నారు. సాలెహ్‌నగర్‌ ఈద్గాలో ఉదయం 9-30 గంటలకు కరీంనగర్‌ సదర్‌ ఖాజీ మన్‌ఖబత్‌షాఖాన్‌ నమాజ్‌ చేయించనుండగా ముఫ్తీ మహమ్మద్‌ ఘియాస్‌ మొహియొద్దీన్‌ సందేశమివ్వనున్నారు. జిల్లా కేంద్రంలో పురానీ ఈద్గాతోపాటు సాలేహ్‌నగర్‌, చింతకుంట, బైపాస్‌రోడ్‌ ఈద్గాల్లో, పలు మండల, గ్రామ కేంద్రాల్లోని ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు జరగనున్నాయి. ఆయా ఈద్గాలలో మున్సిపల్‌ కార్పొరేషన్‌, గ్రామపంచాయతీ, పోలీసు, ఫైర్‌, వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

ఫ మార్కెట్‌లో సందడి

రంజాన్‌ పండగ వస్త్రాలు, వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్‌ సందడిగా మారింది. ముస్లింలు షాపింగ్‌ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. గిరాకీ బాగుంటుందని వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వస్త్ర, వ్యాపార సముదాయాలు జన జాతరను మరపిస్తున్నాయి. పురుషులు బట్టలు, టోపీలు, అత్తర్లు, స్ర్పేలు, భుజాలపై టవల్స్‌, స్వీట్లు, సేమియాలు, స్త్రీలు బట్టలు, గాజులు, సుర్మా, మెహందీ, అలంకరణ సామాగ్రి కొంటున్నారు. గృహాలంకరణ సామాగ్రికి గిరాకీ పెరిగింది.

Updated Date - Apr 10 , 2024 | 11:55 PM

Advertising
Advertising