ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీకి ఘన నివాళులు

ABN, Publish Date - Jun 24 , 2024 | 12:42 AM

జాతీయవాద భావజాల రాజకీయ ఆద్యుడు శ్యామ్‌ ప్ర సాద్‌ ముఖర్జీ అని బీజేపీ ఇన్‌చార్జ్‌ కందుల సంధ్యారాణి అన్నారు.

గోదావరిఖని, జూన్‌ 23: జాతీయవాద భావజాల రాజకీయ ఆద్యుడు శ్యామ్‌ ప్ర సాద్‌ ముఖర్జీ అని బీజేపీ ఇన్‌చార్జ్‌ కందుల సంధ్యారాణి అన్నారు. బీజేపీ తలపెట్టి న విజయ్‌దివస్‌ కార్యక్రమంలో భాగంగా తిలక్‌నగర మండల అధ్యక్షుడు గోపగోని నవీన్‌గౌడ్‌, జనగామ మండల అధ్యక్షుడు గుండబోయిన భూమాన్న ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి రామగుండం బీజేపీ ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి హాజరై శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ జాతీయ సమై క్యత కోసం పట్టుదలతో పనిచేసి దేశంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ మార్గం చూపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ అన్నారు. ఆయన ఆలోచనలే మెరుగు దిద్దుకొని భారతీయ జన సంఘానికి, ఆ తర్వాత భార తీయ జనతా పార్టీకి కూడా మూల భూత సైద్ధాంతిక ఆధార అయ్యిందన్నారు. ఏక్‌ దేశ్‌ మే దో ప్రధాన్‌, దో నిషాన్‌, దో విధాన్‌ నహి చలేగా అని నినదించి జమ్మూ కాశ్మీర్‌ 370 ఆర్టికల్‌ విముక్తి కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహించారన్నారు. ఈ ఉద్యమంలో భాగంగానే జమ్మూకాశ్మీర్‌లో అరెస్టు అయి నిర్బంధంలోనే మరణిం చారన్నారు. దేశ ప్రజల విముక్తి కోసం, పూర్తి స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని శ్యామప్రసాద్‌ముఖర్జీ జీవితం అందరికీ ఆదరణీయం, ఆదర్శ వంతం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నాయకులు కొండ పర్తి సంజీవ్‌, కోమల్ల మహేష్‌, చుక్కల రాములు, కొమ్మ స్వామి, జక్కుల ప్రవీణ్‌, శివరామకృష్ణ, పెండ్యాం సత్యనారాయణ, విశ్వనాథ్‌, పంగ రవి, ఆకాష్‌ గౌడ్‌, రెవెళ్లి పద్మ, తడిగొండ నర్సయ్య, వకుళాభరణం కిషోర్‌, భాస్కర్‌, తోకల రాజు, చెన్నూరి రమేష్‌, గోపగోని రాకేష్‌, రమేష్‌, రాజా, అంకార్‌, భరత్‌, పృథ్వీరాజ్‌, కాదాసి శంకర్‌, ఇరుగురాల శివకుమార్‌, సురేష్‌, మిరియాల రాజు, కుమార్‌, శ్రీకాంత్‌ శ్రీనివాస్‌, రవి తదితరులు పాలొన్నారు.

Updated Date - Jun 24 , 2024 | 12:42 AM

Advertising
Advertising