టీఎస్‌టీపీపీ స్టేజ్ 2ను వ్యతిరేకిస్తున్నాం..
ABN, Publish Date - Nov 11 , 2024 | 12:43 AM
రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మించనున్న తెలంగాణ ఎస్‌టీపీపీ స్టేజ్ 2ను తాము వ్యతిరేకిస్తున్నామని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె.రాజన్న స్పష్టం చేశారు.
జ్యోతినగర్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మించనున్న తెలంగాణ ఎస్‌టీపీపీ స్టేజ్ 2ను తాము వ్యతిరేకిస్తున్నామని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె.రాజన్న స్పష్టం చేశారు. ఆదివారం ఐఎఫ్‌టీ యూ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాజ న్న మాట్లాడుతూ టీఎస్‌టీపీపీ 2 దశలో 800 మెగావాట్ల 3 యూనిట్లను(2400 మెగావాట్లు) నెలకొల్పనున్నారని, ఈ ప్రా జెక్టు వల్ల రామగుండం పారిశ్రామిక ప్రాంతం మరింత కాలుష్యం బారిన పడుతుందన్నారు. ఇప్ప టికే 4200 మెగావాట్ల విద్యుత్ ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నదని, వేలాది టన్నుల బొగ్గును మండించడం ద్వారా వాయు కాలుష్యం పెరుగుతుందని పేర్కొ న్నారు. ఈ ప్రాంత అనేక మంది ప్రజలు కాలుష్యం వల్ల తీవ్ర అనారోగ్యం పాలయ్యా రని, ఈ పరిస్థితుల్లో ఎన్టీపీసీ కొత్త ప్రాజెక్టు రావడం పుండుపై కారం చల్లినట్లు అవు తుందన్నారు. ఇంత భారీ కాలుష్యం ఉన్న ప్పటికీ ఇక్కడి ప్రాంతీయ కాలుష్య నియం త్రణ మండలి(పిసిబి) చోద్యం చూస్తున్న దని ఆరోపించారు. కొత్త ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంత నిరుద్యోగులకు ఏమాత్రం ప్రయోజనం లేదని, ఎన్టీపీ సీలో కొత్త ఉద్యోగ నియామకాలను గత 30 సంవత్సరాలుగా చేపట్టడం లేదన్నారు. ఇప్పటికే నిర్మించిన టీఎస్‌టీపీపీ స్టేజ్ 1లో ఏ ఒక్క కొత్త ఉద్యోగ నియామకం జరుగ లేదని రాజన్న గుర్తు చేశారు. స్టేజ్ 1లో కాంట్రాకు కార్మికులుగా కూడా స్థానికులకు అవకాశమివ్వలేదన్నారు. ఇంకా 400 మంది భూ నిర్వాసితులు ఉద్యోగ, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో రామగుండంలో టీఎస్‌టీపీపీ స్టేజ్ 2ను నిర్మించే విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి వేరే ప్రాంతానికి ప్రాజెక్టును తరలించాలని కోరారు.
కాంట్రాక్టు ఉద్యోగాలను అమ్ముకుంటున్నారు..
స్థానిక కాంట్రాక్టర్లు తెలంగాణ ఎన్టీపీసీ ప్రాజెక్టులో తక్కువ ధరకు కోట్ చేసి కాంట్రాక్టులు పొందారని, వారు నష్టపోయే సొమ్మును భర్తీ చేస్తుకోవడానికి కాంట్రాక్టు కార్మిక ఉద్యోగా లను లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయం యాజమాన్యానికి తెలిసినప్పటికీ నిర్లక్ష్యం వహి స్తోందని ఆరోపించారు. కాంట్రాక్టు కాలపరిమితి ముగిసిన తరువాత కొత్త కాంట్రాక్టరు కార్మికులను పనుల్లోంచి తొలగిస్తు న్నారన్నారు. గతంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో 40 కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే, ఎన్టీపీసీలో ఏడాదిలో 80 కోట్ల కుంభ కోణం జరిగిందని తెలిపారు. ఈ విషయంలో ఎన్టీపీసీ వెంటనే స్పందించి స్థానికులకు, భూనిర్వాసితుల పిల్లలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, అన్ని రాజకీయ, ప్రజా సంఘాలు, ప్రజలను భాగస్వామ్మం చేసి స్టేజ్ 2కు వ్యతిరేకంగా త్వరలోనే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు చిలుక శంకర్, బి.బుచ్చన్న, రాయమల్లు, వసంత్, కొమరయ్య, రమేష్ పాల్గొన్నారు.
Updated Date - Nov 11 , 2024 | 12:43 AM