ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్నికల హామీ నిలబెట్టుకున్నాం

ABN, Publish Date - Nov 08 , 2024 | 12:45 AM

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామం చెగ్యాం నిర్వాసితులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రూ.18 కోట్ల ముంపు నష్ట పరిహారానికి సంబంధించిన మిగులు చెక్కులను గురువారం మండలంలోని చెగ్యాం గ్రామంలో ఎంపీ గడ్డం వంశీతో కలిసి నిర్వాసితులకు అందజేశారు.

చెగ్యాంలో చెక్కులు పంపిణీ చేస్తున్న విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎంపీ గడ్డం వంశీ

- ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

వెల్గటూర్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామం చెగ్యాం నిర్వాసితులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రూ.18 కోట్ల ముంపు నష్ట పరిహారానికి సంబంధించిన మిగులు చెక్కులను గురువారం మండలంలోని చెగ్యాం గ్రామంలో ఎంపీ గడ్డం వంశీతో కలిసి నిర్వాసితులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు సంబంధించి మిగిలిన 63 మంది లబ్ధిదారుల నష్టపరిహారానికి చెందిన చెక్కులను ఎంపీ వంశీతో కలిసి పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో తాను బాధితులకు పరిహారం ఇప్పిస్తానని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలు భూములను కోల్పోయినప్పటికీ పరిహారం అందించే విషయంలో గత బీఆర్‌ఎస్‌ న్రాయకులు పట్టించుకోలేదని తెలిపారు. చెగ్యాం గ్రామాన్ని ముంపు ప్రాంతంగా ప్రకటించడంలో దివంగత కాక వెంకటస్వామి పాత్ర ఎంతో ఉందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ముంపు బాధితుల పరిహారం కోసం చేసిన ప్రతీ నిరసనలో, ధర్నాలో వారి వెంట ఉండి ధైర్యాన్నిచ్చామని గుర్తుచేశారు. అర్హత ఉండి పరిహారం అందని వారు ఇంకా ఎవరైనా ఉంటే వారికి కూడా పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

భూ నిర్వాసితుల కలనెరవేర్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

చెగ్యాం భూ నిర్వాసితుల కలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ పేర్కొన్నారు. తన తాత వెంకటస్వామి హయాంలో రూపకల్పన చేసిన ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిహారం చెక్కుల పంపిణీలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పది సంవత్సరాల కాలంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్లంపల్లి భూ నిర్వాసితులకు న్యాయం చేయలేదన్నారు. ప్రభుత్వం కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్‌, తహసీల్దార్‌ శేఖర్‌, ఏఎంసీ చైర్మన్‌ గోపిక జితేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2024 | 12:45 AM