చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం
ABN, Publish Date - Nov 19 , 2024 | 12:18 AM
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు సన్న వడ్లు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామని, రైతులు పండించిన చివరి గింజ వరకూ కోనుగోలు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు.
- ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు
పెద్దపల్లి రూరల్, నవంబరు 18 ( ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు సన్న వడ్లు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామని, రైతులు పండించిన చివరి గింజ వరకూ కోనుగోలు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. సోమవారం మండలంలోని రాంపల్లి గ్రామంలో పెద్దపల్లి వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సన్నాలకు రూ.500 బోనస్‌ను అందిస్తున్నామని, రైతుల ఖాతాలో బోనస్ జమ అవుతున్న కూడా ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. రైతుల ఖాతాలో బోనస్ పడడం ప్రారంభమైందని రైతులెవరూ అధైర్య పడవద్దని సన్నవడ్లు సాగు చేసుకున్న ప్రతి ఒక్కరికి బోనస్ అందుతుందన్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అలాగే ఎలాంటి కటింగ్‌లు లేకుండా ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ప్రతి గింజకు మద్దతు ధర చెల్లించి వడ్లను కొనుగోలు చేయడం జరుగుతుందని, సెంటర్లలో వడ్లను కాంట వేసిన అనంతరం రైతులు రసీదులు పొందాలన్నారు రైతులకు ఎక్కడ మోసం జరిగినా సహించేది చేసేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ మాదిరెడ్డి నర్సింహారెడ్డి, సంపత్‌రావు, మాజీ సర్పంచ్ కనపర్తి శ్రీలేఖ-ప్రభాకర్‌రావు, గన్నమానేని తిరుపతిరావు, రమేష్, సతీష్, సింగిల్ విండో సీఈవో మధు మరియు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు మరియు అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 19 , 2024 | 12:18 AM