ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తాం

ABN, Publish Date - Nov 30 , 2024 | 12:32 AM

కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తామని ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో గల కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

- ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

జగిత్యాల, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తామని ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో గల కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్నారన్నారు. రైతుల సంక్షేమానికి అవసరమైన కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,26,890 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. దానికి సంబంధించి 27,530మందికి పైగా రైతులకు సుమారు 433 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశామని వివరించారు. సుమారు 2,148 మెట్రిక్‌ టన్నుల సన్న వడ్లను కొనుగోలు చేశామని తెలిపారు. దీనికి సంబందించిన బోనస్‌ 3.16 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా, తప్ప, తాలు, తేమ పేరుతో తిప్పలు పెట్టకుండా వడ్లు కొనుగోలు చేసినట్లు వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 72,100 మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని వెల్లడించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల 19,464 మంది రైతులకు రుణమాఫీ జరగలేదన్నారు. వీరికి సైతం సాధ్యమైనంత తొందరలో రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లో జరగనున్న ప్రజా విజయోత్సవాలు- రైతు పండుగ మహాసభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించే కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో ఏర్పాటు చేయనున్న డిజిటల్‌ స్ర్కీన్‌ ద్వారా రైతులు తిలకించవచ్చని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత, జిల్లా వ్యవసాయ అధికారి రాంచందర్‌, సివిల్‌ సప్లయిస్‌ అధికారి ఎస్‌ జితేందర్‌రెడ్డి, సివిల్‌ సప్లయిస్‌ కార్పోరేషన్‌ డీఎం ఎస్‌జీ జితేంద్రప్రసాద్‌, జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్‌, లీడ్‌ బ్యాంకు డిస్ట్రిక్‌ మేనేజర్‌ రాజుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:33 AM