ప్రజాభిప్రాయ సేకరణలో ఎన్టీపీసీని నిలదీస్తాం
ABN, Publish Date - Nov 13 , 2024 | 12:41 AM
విద్య, ఉపాధి, వైద్యం విషయాలపై ఎన్టీపీసీ యాజమాన్యం స్పష్టత ఇచ్చిన తరువాతనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశా రు.
జ్యోతినగర్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : విద్య, ఉపాధి, వైద్యం విషయాలపై ఎన్టీపీసీ యాజమాన్యం స్పష్టత ఇచ్చిన తరువాతనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశా రు. తెలంగాణ ఎస్‌టిపిపి స్టేజ్ 2కు సంబంధించి ఈనెల 29న నిర్వహిస్తున్న ప్రజాప్రాయ సేకరణలో ఎన్టీపీసీ యాజమాన్యాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ఎన్టీపీసీ జరిగిన వి లేకరుల సమావేశంలో చందర్ మాట్లాడుతూ దేశానికి వెలుగు లు అందిస్తుందనే తలంపుతో ఈ ప్రాంతంలోని 17 గ్రామాల ప్రజలు తమ భూములను ఎన్టీపీసీకి త్యాగం చేశారని, నాలుగు న్న దశాబ్ధాలు దాటతున్నప్పటికీ భూనిర్వాసితులకు సరైన న్యా యం చేయలేదన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామ ని, ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేస్తామని చెప్పిన ఎన్టీపీసీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇంకా వందల మంది నిర్వాసితులు, వారి పిల్లలకి ఎన్టీపీసీ ఉపాధి కల్పించాల్సి ఉందని తెలిపారు.ఈ నాలుగున్నర దశాబ్దాలతో ఎంత మంది భూనిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించారో పబ్లిక్ హియరింగ్‌కు ముందే ఎన్టీపీసీ నివేదికను ప్రకటించాలని, అలాగే ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కాలనీల్లో ఎన్ని కోట్ల నిధులను సీఎస్‌ఆర్ కింద ఖర్చు చేశారో ప్రకటించాలని చందర్ డిమాండ్ చేశారు. మహారత్న హోదా ఉన్న ఎన్టీపీసీ వేలాది ఎకరాల భూములు ధారాదత్తం చేసిన ఈప్రాంతానికి సకల సౌక ర్యాలు కల్పించాల్సి ఉండగా అందుకు భిన్నంగా మొండి చెయ్యి చూపించిందని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యా సంస్థలను ఎన్టీపీసీ స్థాపించాలని, ఈ ప్రాంత ప్రజల కోసం ఉచిత సూపర్‌సెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. తెలం గాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో భూనిర్వాసితులు, స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ సరైన వివరణ ఇవ్వకుంటే ప్రజాభిప్రాయ సేకరణకు ముందు వారం రోజులపాటు బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడు తామని తెలిపారు. అలాగే పబ్లిక్ హియరింగ్ రోజు తమ పార్టీ శ్రేణులు యాజమాన్యాన్ని గట్టిగా నిలదీస్తామన్నారు. విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అహాషేక్‌రావు, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీని వాస్, కృష్ణవేణి, బీఆర్‌ఎస్ నాయకులు బుర్ర శంకర్‌గౌడ్, ఈదునూరి పర్వతాలు, రాంపెల్లి శ్రీనివాస్, ఈదునూరి శంకర్, వీరాలాల్, దొండ పాటి మహేందర్‌రెడ్డి, బండి తిరుపతి, రాజేశ్, నారాయణ, ఒల్లాల మల్లే శం, శేఖర్, వేణు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 13 , 2024 | 12:41 AM