ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రమాదానికి కారణాలేంటి..?

ABN, Publish Date - Nov 14 , 2024 | 12:55 AM

జిల్లాలోని రాఘవాపూర్‌ వద్ద గూడ్స్‌ రైలు ప ట్టాలు తప్పిన ప్రమాదనికి కారణాలేమిటనే విషయ మై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటనకు ఓవర్‌ లోడ్‌ కారణమా, ట్రాక్‌ నిర్వహణ లోపమా అనే విషయాలపై ఆరాతీస్తున్నారు. ఢిల్లీ, సికింద్రా బాద్‌, చెన్నై ప్రధానలైన్‌ కావడంతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌, విద్యుత్‌ లైన్లను యుద్ధ ప్రాతిపదికన పునరు ద్ధరిస్తున్నారు.

- గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంపై రైల్వే అధికారుల విచారణ

- ట్రాక్‌ నిర్వహణపై ఆరా.. వేగంగా పునరుద్ధరణ పనులు

- నేటి ఉదయం వరకు ట్రాక్‌ పునరుద్ధరించే అవకాశాలు

- పలు రైళ్ల రాకపోకలు రద్దు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలోని రాఘవాపూర్‌ వద్ద గూడ్స్‌ రైలు ప ట్టాలు తప్పిన ప్రమాదనికి కారణాలేమిటనే విషయ మై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటనకు ఓవర్‌ లోడ్‌ కారణమా, ట్రాక్‌ నిర్వహణ లోపమా అనే విషయాలపై ఆరాతీస్తున్నారు. ఢిల్లీ, సికింద్రా బాద్‌, చెన్నై ప్రధానలైన్‌ కావడంతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌, విద్యుత్‌ లైన్లను యుద్ధ ప్రాతిపదికన పునరు ద్ధరిస్తున్నారు. గురువారం ఉదయం వరకు పూర్తి స్థాయిలో లైన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం రాత్రి పెద్దపల్లి, రామగుండం మార్గ మధ్యమలోని కన్నాల బోడగుట్ట 282/38, 282/34 కిలోమీటర్ల మధ్యన ఈ ప్రమాదం సంభవించినట్టుగా రైల్వే అధికారులు గుర్తించారు. మొత్తం 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఐరన్‌ కాయిల్స్‌ తరలిస్తున్న గూడ్స్‌ రైలుకాబట్టి ఆస్తినష్టం తప్ప ప్రాణనష్టం జరగలేదు. ఇదే సమయంలో ప్రయాణికులు వెళ్లే రైలు పట్టాలు తప్పినట్టయితే మాత్రం భారీ ప్రాణ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేదని ఘటన తీరును బట్టి స్పష్టం అవుతోంది.

ఫ ఓవర్‌ లోడ్‌ కారణమా..

గూడ్సు రైలు ఓవర్‌ లోడ్‌తో ప్రయాణించడమే కారణమా అనే కోణంపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. సామర్థ్యానికి మించి లోడ్‌ చేయడం వల్లే పట్టాలు తప్పి ఉంటుందని అంచనా వేస్త్తున్నారు. అయితే రైల్వే అధికారులు సాధారణంగా ఓవర్‌ లోడింగ్‌ విధానం అమలుచేస్తుంటారని, అయితే రెండు కోచుల్లో ఎక్కువ మోతాదులో లోడ్‌ చేసినట్టయితే మరో కోచులో సాధారణ సామర్థ్యం మేరకు లోడింగ్‌ చేస్తారని తెలుస్తోంది. దీనివల్ల ట్రాక్‌పై అదనపు భారం పడకుండా ఉండడంతో పాటు ట్రాక్‌పై వెళ్తున్నా ప్రమాదాలు జరగకుండా ఉంటాయని అంచనా వేస్తారని సమాచారం. ట్రైన్‌ బ్యాలెన్సింగ్‌ కూడా తప్పే అవకాశం ఉండదని కూడా తెలుస్తోంది. అయితే రాఘవాపూర్‌ వద్ద మంగళవారం రాత్రి పట్టాలు తప్పిన గూడ్సులోని అన్ని కోచుల్లోనూ సామర్థ్యానికి మించి లోడింగ్‌ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుకుంటున్నారు. సాధారణంగా గూడ్సు రైళ్లలో లోడింగ్‌ చేసేప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు సాంకేతిక నిపుణులు కూడా పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ట్రాక్‌పై వెళ్తున్నప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ లోడింగ్‌ చేయాల్సి ఉంటుందని సమాచారం. అలాంటప్పుడు గజియాబాద్‌ నుంచి వెళ్తున్న గూడ్సు రైలులో మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోలేదా?, సాంకేతిక విభాగం ఈ అంశాన్ని పట్టించుకోలేదా..? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఫ ట్రాక్‌ మెయింటనెన్స్‌పై ఆరా!

ట్రాక్‌ మెయింటనెన్స్‌ విభాగం ఎలాంటి చర్యలు తీసుకుంది? అన్న కోణంలో కూడా రైల్వే అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. దక్షిణ భారత దేశానికి, ఉత్తర భారత దేశానికి అనుసంధానం చేసే ప్రధాన రైల్వేలైన్‌ కాబట్టి తరచూ ఈ ట్రాక్‌ సామర్థ్యం ఎలా ఉంది, ట్రాక్‌ కింది భాగంలో భూమి కుంగుబాటుకు గురవుతుందా..? ట్రాక్‌ సమీపంలో నీటి నిలువ ఉన్నట్టయితే వాటిని మళ్లించడం వంటి చర్యలు చేపట్టాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు ట్రాక్‌ మెయింటెనెన్స్‌ వింగ్‌ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఏకధాటిగా కురిసిన వర్షాల వల్ల ట్రాక్‌ కింది భాగంలో నీటి నిలువలు చేరడం వల్ల ట్రాక్‌ కుంగుబాటుకు గురై ఉంటుందా లేక, ట్రాక్‌ ఇరుపక్కల వాటర్‌ స్టోరేజీ వల్ల ట్రాక్‌ దెబ్బ తిని ఉంటుందా అన్న విష యాన్ని కూడా తెలుసుకునే పనిలో రైల్వే అధికారులు నిమగ్నం అయ్యారు. ఒకవేళ ట్రాక్‌కు ఇరుపక్కల నీటి నిలువ కారణంగానే అక్కడ పట్టాలు కుంగిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టయితే నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసిన డ్రైన్‌ వ్యవస్థ సరిగా లేదా అన్న విషయంలోనూ ఆరా తీయాల్సి ఉంటుంది. ఒక్క గూడ్సు రైల్‌ పట్టాలు తప్పడంతో 20 నుంచి 30వరకు ట్రైన్లు రద్దు చేయడంతో పాటు దారి మళ్లించాల్సి వచ్చిందని, దీనివల్ల రైల్వే శాఖపై అదనపు ఆర్థిక భారం పడినట్టేనని స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో గూడ్సు రైల్‌ పట్టాలు తప్పిన ఘటనపై సమగ్ర విచారణ జరిపినట్టయితే వాస్తవాలు బయటపడే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

ఫ ట్రయల్‌ రన్‌ విజయవంతం

రాఘవాపూర్‌ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో దెబ్బతిన్న ట్రాక్‌ పనులను పునరు ద్ధరించే పనిలో రైల్వే యంత్రాంగం నిమగ్నం అయ్యింది. మంగళవారం అర్ధరాత్రే రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్‌ను బాగు చేస్తున్నారు. కానీ గూడ్సు రైల్‌ కోచులు పట్టాలు తప్పడంతో ఈ ప్రాంతం మీదుగా వెళ్తున్న మూడు ట్రాకులు కూడా ధ్వంసం అయిపోయాయి. బుధవారం రాత్రి వరకు రెండు ట్రాక్‌ల మీదుగా ట్రయల్‌ రన్‌ నిర్వహించగా విజయవంతం అయ్యింది. దీంతో గురువారం ఉదయం వరకు రైళ్ల రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంది.

Updated Date - Nov 14 , 2024 | 12:55 AM