ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎవరికి వారే..

ABN, Publish Date - Oct 22 , 2024 | 01:21 AM

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేయతలపెట్టిన ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనుంది.

- కాంగ్రెస్‌లో ఇందిరమ్మ కమిటీల చిచ్చు

- విడివిడిగా జాబితాల సమర్పణ

- కరీంనగర్‌ నియోజక వర్గంలో గందరగోళం

- సమన్వయ లోపంతో కార్యకర్తల్లో అసంతృప్తి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేయతలపెట్టిన ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనుంది. ఈ అంశంలో కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గతంగా కొత్త చిచ్చును రాజేస్తోంది. విపక్ష ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న నియోజకవర్గాల్లో కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. ఈ నెల 19లోగా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీలో సందడి నెలకొంది. కరీంనగర్‌ జిల్లాలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొన్నది. కరీంనగర్‌, హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, పాడి కౌశిక్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చొప్పదండి, మానకొండూర్‌ నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ రెండు నియోజక వర్గాల్లో వారి నేతృత్వంలోనే గ్రామ, పట్టణ ప్రాంతాల ఇందిరమ్మ కమిటీల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఆయా నియోజక వర్గాల్లోని గ్రామాల్లో పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలకు చోటు కల్పిస్తూ ఇందిరమ్మ కమిటీలను రూపొందించి జిల్లా ఇన్‌చార్జి మంత్రికి పంపిస్తున్నారు.

ఫ కరీంనగర్‌లో పలు జాబితాలు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్‌, హుజూరాబాద్‌ నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు నాయకులు వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే విపక్ష పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ కమిటీల ఏర్పాటులో కీలకంగా ఉంటారని, ఆయన సూచనల మేరకే కరీంనగర్‌, హుజూరాబాద్‌ నియోజక వర్గాల్లో నియోజకవర్గాల ఇన్‌చార్జిలు కమిటీలు రూపొందిస్తున్నట్లు సమాచారం. మంత్రి ప్రభాకర్‌ సూచన మేరకు రూపొందించిన జాబితాతోపాటు సుడా చైర్మన్‌, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో పది సంవత్సరాలుగా క్రియాశీలంగా వ్యవహరిస్తున్న వారి పేర్లతో 60 డివిజన్ల కమిటీలను జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తం కుమార్‌రెడ్డికి అందజేసినట్లు తెలిసింది. నియోజకవర్గ ఇన్‌చార్జి పురమల్ల శ్రీనివాస్‌ తన అనుచరులతో జాబితా రూపొందించి వారికి ఇందిరమ్మ కమిటీల్లో చోటు కల్పించాలని కోరినట్లు సమాచారం.

ఫ ఎవరి జాబితాలు ఆమోదం పొందుతాయో..

హుజూరాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో సఖ్యతగానే ఉంటారు. ఆయన రూపొందించిన జాబితాలు ఆమోదం పొందే అవకాశం ఉంది. కరీంనగర్‌ కార్పోరేషన్‌కు వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. ఇటీవల కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే వరకు కూడా కాంగ్రెస్‌ ఉనికి ఈ నియోజక వర్గంలో పెద్దగా లేదు. సిటీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు మినహా ఎక్కడా కార్యక్రమాలు నిర్వహించలేదు. కాంగ్రెస్‌లో ఉన్న నేతలంతా బీఆర్‌ఎస్‌కు ఇతర పార్టీలకు వలస పోయారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 11 మంది కార్పొరేటర్లు, 10 మంది మాజీ కార్పొరేటర్లు, మరికొందరు సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరికలతో పార్టీ కొంత క్రియాశీలకంగా మారినా.. వీరితోనే కొత్త తలనొప్పి మొదలయింది. ఇప్పటికే మంత్రి సూచన మేరకు ఒక జాబితా, సుడా చైర్మన్‌ ఆధ్వర్యంలో మరో జాబితా సిద్ధం కాగా కొత్తగా పార్టీలో చేరిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు తమ తమ డివిజన్లలో తమ అనుచరులతో ఇందిరమ్మ కమిటీలను రూపొందించి ఆ జాబితాలను ఆమోదించాల్సిగా కోరుతూ ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి తమ అనుచరులతో కమిటీలు ఏర్పాటు చేస్తే మొదటి నుంచి పార్టీలోనే ఉండి అధికారంలో లేనప్పుడు కష్టపడ్డ వారి పరిస్థితి ఏమిటని అసలు కాంగ్రెస్‌ వాదులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్‌, హుజూరాబాద్‌ నియోజక వర్గాల్లో ఇందిరమ్మ కమిటీలను తమ కార్యకర్తలతో రూపొందించి జిల్లా యంత్రాంగానికి అందజేయాలని నిర్ణయించారని తెలిసింది. ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేయడంలో క్రియాశీల పాత్ర వహిస్తాయి. సామాజిక తనిఖీలు చేసే అధికారాన్ని కలిగి ఉంటాయి. దీంతో ఈ కమిటీలకు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. కమిటీల్లో చోటు దక్కించుకోవడానికి కాంగ్రెస్‌ నాయకులు నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీల చుట్టు తిరుగుతూ ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 19న జిల్లా జిల్లా నుంచి రూపొందించిన జాబితాలు అందిన తర్వాత జిల్లా ఇన్‌చార్జి మంత్రి కమిటీలను ప్రకటిస్తారు. అప్పుడు ఏ కమిటీలు ఆమోదముద్ర పొందుతాయో, ఎవరి సిఫారసులు పనిచేశాయో తెలిసే అవకాశం ఉంటుంది.

Updated Date - Oct 22 , 2024 | 01:21 AM