ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అభ్యసనా సామర్థ్యాలు మెరుగయ్యేనా..?

ABN, Publish Date - Nov 10 , 2024 | 01:23 AM

విద్యార్థుల్లో అ భ్యసనా సామర్థ్యాలను పరీక్షించేందుకు జాతీయ స్థాయి లో నిర్వహించే న్యాస్‌లో లక్ష్యం మేరకు ఫలితాలు సా ధించడానికి అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తోంది. ప్రతీ మూడేళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వ ఎన్‌సీఈఆర్టీ జాతీయ సాధన సర్వే (న్యాస్‌) నిర్వహి స్తోంది.

- డిసెంబరు 4న విద్యార్థులకు న్యాస్‌ పరీక్ష

జాతీయ స్థాయి సర్వే కోసం మూడేళ్లకోసారి నిర్వహణ..

జిల్లాలో 20 వేలపైగా విద్యార్థులు హాజరు

జగిత్యాల, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో అ భ్యసనా సామర్థ్యాలను పరీక్షించేందుకు జాతీయ స్థాయి లో నిర్వహించే న్యాస్‌లో లక్ష్యం మేరకు ఫలితాలు సా ధించడానికి అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తోంది. ప్రతీ మూడేళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వ ఎన్‌సీఈఆర్టీ జాతీయ సాధన సర్వే (న్యాస్‌) నిర్వహి స్తోంది. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 3, 6, 9వ తరగతు లు చదువుతున్న విద్యార్థుల సామార్థ్యాలను పరీక్షీంచేం దుకు ఈ సంవత్సరం నవంబర్‌ 19న ఎన్సీఈఆర్టీ ఆధ్వ ర్యంలో పరీక్ష ద్వారా సర్వే నిర్వహించేందుకు సమాయ త్తమవుతున్నారు. న్యాస్‌ (నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే) ని ర్వహణ, విద్యార్థులను సిద్ధం చేయాల్సిన తీరుపై ఇప్ప టికే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఈ పరీక్షను ప్రా థమిక స్థాయిలో మూడో తరగతి, ప్రాథమికోన్నత స్థా యిలో ఆరో తరగతి, ఉన్నత స్థాయిలో 9వ తరగతి వి ద్యార్థులకు నిర్వహించనున్నారు. ప్రతీ రోజు ప్రత్యేక బో ధనాభ్యసన ప్రక్రియను చేపడుతూ వారి సామర్థ్యాల ను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నిస్తున్నా రు. ఈ క్రమంలోనే న్యాస్‌ పరీక్షలో ప్రతిభ కనబర్చేందు కు విద్యార్థులకు మోడల్‌ పరీక్షలను మాక్‌ టెస్ట్‌ల రూ పంలో మూడు సార్లు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభు త్వం పాఠశాల విద్యాశాఖ ఆయా జిల్లా విద్యాశాఖ అధి కారులకు దిశా నిర్ధేశం చేసింది. ఈ మేరకు ఇటీవల మాక్‌ పరీక్ష జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు.

స్థానం మెరుగుదలకు ప్రయత్నం...

పాఠశాల స్థాయి విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలు సన్నగిల్లుతున్నాయని 2017, 2021 సంవత్సరాల్లో నిర్వ హించిన న్యాస్‌ ఫలితాలు వెల్లడించాయి. జాతీయ స్థా యిలో తెలంగాణకు మొదటి 20 స్థానాల్లోనూ చోటు ద క్కలేదు. దీంతో ఈసారైనా మంచి ఫలితాలను రాబట్టాల నే లక్ష్యంతో కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇందు లో భాగంగానే ప్రాథమిక స్థాయిలో ఎఫ్‌ఎల్‌ఎన్‌, ఉన్నత స్థాయిలో లిప్‌ పోగ్రాం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ ద్వారా ఉపాధ్యాయులకు, అధికారు లకు దిశనిర్ధేశనం చేశారు.

మూడు మాక్‌ టెస్ట్‌ నిర్వహణ...

జిల్లా వ్యాప్తంగా డిసెంబర్‌లో నిర్వహించే జాతీయ స్థాయి సాధన సర్వే పరీక్షకు సిద్ధం చేయడంలో భాగం గా మూడు మోడల్‌ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. సెపెంబర్‌ 10వ తేదీన, 30వ తేదీన, న వంబర్‌ 8వ తేదీన మాక్‌ టెస్టులు నిర్వహించారు. ప్ర ధాన పరీక్ష డిసెంబర్‌లో 4వ తేదీన నిర్వహించనున్నారు. ఈ సారి జాతీయస్థాయి సాధన పరీక్షలో రాష్ట్ర స్థానాన్ని మెరుగుపరిచేందుకు జిల్లాల వారీగా కార్యాచరణను ని ర్వహిస్తున్నారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ, పంచాయతీరా జ్‌, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలు, రెసిడెన్షియల్‌ స్కూ ల్లో ని మూడు, ఆరు, తొమ్మిది తరగతులు చదువుతున్న వి ద్యార్థులందరినీ ఇందుకు అనుగుణంగా సిద్ధం చేస్తు న్నా రు. జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షకు దాదాపు 20వేలకుపై గా విద్యార్థులు హాజరవనున్నారు.

మంచి ఫలితాలు రాబట్టేలా కార్యాచరణ..

- జగన్‌ మోహన్‌ రెడ్డి, జిల్లా విద్యాధికారి, జగిత్యాల

ప్రతీ మూడోళ్లకోసారి జాతీయ స్థాయిలో నిర్వహించే సర్వే పరీక్ష (న్యాస్‌)ద్వారా విద్యార్థుల అభ్యసనా సామ ర్థ్యాలను మదిస్తారు. ఈ సారి జిల్లాలో మంచి ఫలితాల ను రాబట్టేలా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ ను చేపట్టింది. ఇందులో భాగంగానే ఉపాధ్యాయులకు ఇ దివరకే తగిన శిక్షణను అందించాం. త్వరలో నిర్వహిం చే ప్రధాన పరీక్షకు ముందు మాదిరి పరీక్షలను మూడు సార్లు నిర్వహిస్తున్నాం.

Updated Date - Nov 10 , 2024 | 01:23 AM