ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతుకు ‘భరోసా’ అందేనా..?

ABN, Publish Date - Nov 13 , 2024 | 01:03 AM

వానాకాలం సీజన్‌ ముగిసింది..యాసంగి సీజన్‌ వచ్చేసింది.. అయినా ప్రభుత్వం రైతు భరోసాపై స్పష్టత ఇవ్వడం లేదు. కనీ సం ఈ సీజన్‌లోనైనా పెట్టుబడి సాయం అందుతుం దా...అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ప్ర భుత్వం 2018 వానాకాలం నుంచి 2023 యాసంగి వర కు వరుసగా 12 సార్లు పెట్టుబడి సాయం అందించింది.

జగిత్యాల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌ ముగిసింది..యాసంగి సీజన్‌ వచ్చేసింది.. అయినా ప్రభుత్వం రైతు భరోసాపై స్పష్టత ఇవ్వడం లేదు. కనీ సం ఈ సీజన్‌లోనైనా పెట్టుబడి సాయం అందుతుం దా...అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ప్ర భుత్వం 2018 వానాకాలం నుంచి 2023 యాసంగి వర కు వరుసగా 12 సార్లు పెట్టుబడి సాయం అందించింది. సీజన్‌ ప్రారంభానికి ముందే రైతు బంధు ఇవ్వడంతో రైతులు సకాలంలో విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసుకునే వారు. 2023 వరకు జిల్లాలో లక్షల మంది రైతులకు రూ. కోట్లలో రైతుబంధు రూపంలో గత ప్ర భుత్వం అందజేసింది. చివరగా 2023-24 యాసంగిలో నూ సుమారు 2.39 లక్షల మంది రైతులకు రూ. 212.32 కోట్ల పెట్టుబడి సాయం అందించింది.

స్పష్టత కరువు....

గతేడాది డిసెంబర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో తాము అధికారం లోకి రాగానే రైతు భరోసా ప్రతి ఏడాది ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి 11 నె లలు గడిచినా పెట్టుబడి సాయంపై స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే వానాకాలం సీజన్‌ గడిచిపోయింది. యాసంగి సీజన్‌ రానే వచ్చింది. వ్యవసాయశాఖ అధికారులు సా గు అంచనా సైతం ఖరారు చేశారు. యాసంగిలో వివిధ పంటలు సాగవుతాయని ప్రణాళిక రూపొందించారు. కా నీ పెట్టుబడి సాయానికి సంబంధించి ఇప్పటి వరకు ప్ర భుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వానాకాలంలో ఎలాగూ ఇవ్వలేదు. కనీసం యాసంగిలోనైనా పెట్టుబడి సాయం అందుతుందా.. లేదా అంటూ రైతులు అను మానం వ్యక్తం చేస్తున్నారు.

గందరగోళంగా రుణమాఫీ....

జిల్లాలో రుణమాఫీ గందరగోళంగా మారింది. ఏ ప్రా తిపాదికన రుణమాఫీ చేశారో అర్థంకాని పరిస్థితి నెల కొంది. లేనిపోని సాకులతో అనేక మంది రైతుల రుణా ల మాఫీ కాలేదు. తెల్ల రేషన్‌ కార్డు లేని వారికి అధికా రులు కుటుంబ నిర్థారణ చేశారు. అయితే ఇప్పటి వరకు వారి ఖాతాల్లో రుణమాఫీ డబ్చులను జమ చేయలేదు. అలాగే కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులకు సైతం మా ఫీ చేసిన ప్రభుత్వం...మరికొంత మందికి చేయలేదు. అంతేకాకుండా కొందరు ప్రభుత్వ ఉద్యోగి తల్లి దండ్రు లకు సైతం రుణమాఫీ కాలేదు. ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే...తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతు న్నారు. బ్యాంకర్ల నుంచి ప్రభుత్వం నేరుగా డేటా తీసు కుందని అంటున్నారు. అలాగే రైతు భరోసా సైతం ఏ ప్రాతిపదికన ఇస్తారనేది ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.

జిల్లాలో సాగు అంచనా..

జిల్లాలో యాసంగి సీజన్‌లో సుమారు 3.55 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారన్న అంచనా ఉం ది. ఇందులో ప్రధానంగా వరి పంటను సాగు చేయనున్నారు. జిల్లాలో వరి పంట 3,03,000 ఎకరాలు, మొక్కజొన్న 27,200 ఎకరాలు, నువ్వులు 21,500 ఎకరా లు, పల్లి 460 ఎకరాలు, పెసర 400 ఎకరాలు, మినుము 250 ఎకరాలు, ఆలసంద 300 ఎకరాలు, ఆవాలు 3,100 ఎకరాలు, చెరుకు 890 ఎకరాలు, ఆయిల్‌ ఫామ్‌ 800 ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో పది నుంచి ఇరవై శాతం హెచ్చు తగ్గులు ఉండవచ్చన్న అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.

విత్తనాలు, ఎరువుల అవసరాలు ఇలా..

జిల్లాలో యాసంగి సీజన్‌లో యూరియా 39,100 ట న్నులు, డీఏపీ 16,219 టన్నులు, పొటాష్‌ 8,148 టన్ను లు, సూపర్‌ 5,231 టన్నులు, కాంప్లెక్స్‌ 36,000 టన్నులు అవసరముంటుందని అంచనా వేశారు. అదేవిదంగా వరి విత్తనాలు 75,750 క్వింటాళ్లు, మొక్కజొన్న 2,176 క్విం టాళ్లు, మినుము 515 క్వింటాళ్లు, పెసర 117 క్వింటాళ్లు, ఆవాలు 46 క్వింటాళ్లు, నువ్వులు 470 క్వింటాళ్లలో అవ సరవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈమే రకు ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుకు వచ్చి రైతు భరోసా అందించాలని అన్నదాతలు కోరుతున్నారు.

Updated Date - Nov 13 , 2024 | 01:04 AM