ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహి ళలు అన్ని రంగాల్లో ముందుండాలి..

ABN, Publish Date - Nov 30 , 2024 | 12:17 AM

చిగురుమామిడి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రబాకర్‌ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, పిల్లల సంక్షేమానికే శుక్రవారం సభ నిర్వస్తున్నామన్నారు.

సభలో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌..

చిగురుమామిడి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రబాకర్‌ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, పిల్లల సంక్షేమానికే శుక్రవారం సభ నిర్వస్తున్నామన్నారు. ఈసభలో ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రతిజ్ఞ చేయాలన్నారు. శుక్రవారం సభ పై మరింత మహిళలకు అవగహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఆర్డీవో మహేశ్వర్‌, తహసీల్దార్‌ ముద్ద సాని రమేష్‌, ఎంపీడీవో బాస మధుసూదన్‌, హుస్నాబాద్‌ మార్కుట్‌ కమిటీ చైర్మన్‌ కంది తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

ఫ ఆరోగ్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి..

మహిళలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో 50 వేలు ఖర్చు అయ్యే 60 రకాల పరీక్షలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగానే నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. ఆరోగ్య సిబ్బంది అన్ని సందర్భాల్లో బాలింతలకు, గర్భిణులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. పిల్లలు వయసుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలన్నారు.

ఫ చిన్నారిని ఎత్తుకుని.. లాలించి..

శుక్రవారం సభకు వచ్చిన ఓ చిన్నారిని కలెక్టర్‌ పమేలాసత్పతి ఎత్తుకుని కాసేపు ఆమెతో ఆడుకున్నారు. సమావేశం జరిగినంత సేపు ఆ చిన్నారిని తన ఒడిలోనే ఉంచుకుని ఆడించారు.

Updated Date - Nov 30 , 2024 | 12:17 AM