రామగుండం ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి
ABN, Publish Date - Nov 11 , 2024 | 12:42 AM
రామగుండం ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమా నికి కృషి చేస్తానని ఎన్‌బీసీ సభ్యుడు, గుర్తింపు కార్మిక సంఘం సెక్రెటరీ జనరల్ బాబర్ సలీం పాషా తెలిపారు.
జ్యోతినగర్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : రామగుండం ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమా నికి కృషి చేస్తానని ఎన్‌బీసీ సభ్యుడు, గుర్తింపు కార్మిక సంఘం సెక్రెటరీ జనరల్ బాబర్ సలీం పాషా తెలిపారు. ఎన్టీపీసీకి చెందిన విశ్రాంత ఉద్యో గులు రచించిన జ్యోతి కిరణాలు 2 కవితా సంకలనాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాలులో రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం(రెవా) ఆధ్వర్యంలో జరిగిన కా ర్యక్రమంలో ఎన్‌బీసీ సభ్యుడు, గుర్తింపు కార్మిక సంఘం సెక్రెటరీ జనరల్ బాబర్ సలీం పాషా ముఖ్యఅతిథిగా హాజరై పుస్తకాన్ని విడుదల చేశా రు. 14మంది రిటైర్డ్ ఉద్యోగులు, వారి సతీమణు లు రచించిన కవితలను పుస్తకంలో పొందుపరి చారు. రెవా అధ్యక్షుడు ఆకుల రాంకిషన్ అధ్యక్షత న జరిగిన సమావేశంలో పలువురు స్థానిక కవు లు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. ఈసందర్భంగా బాబర్‌సలీంపాషా ప్రసంగిస్తూ ఎన్టీపీసీ ఉద్యోగు లుగా పని చేస్తూ సాహిత్యంపై ఉన్న మక్కువతో కవితలు రాశారన్నారు. పదవీ విరమణ తరువా త కూడా తమ సాహిత్యకాంక్షను కొనసాగిస్తూ కవితలు రాయడం విశేషమన్నారు. వీరిని ఎన్టీపీ సీఉద్యోగులు స్ఫూర్తిగా తీసుకొని రచనలు చేయా లని సూచించారు. భవిష్యత్‌లో విశ్రాంత ఉద్యోగు లు తమ కవితా రచనలను కొనసాగించాలని కో రారు. తాను ఉద్యోగుల గుర్తింపు సంఘం నాయ కుడినైనా రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షే మ సంఘానికి కార్యాలయ భవనాన్ని ఇప్పించేం దుకు కృషి చేస్తానని బాబర్ తెలిపారు. కాగా కవులు(ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగులు) సట్టు ముత్యా లు, చెప్యాల శ్రీపతిరావు, టి.సురేందర్, నగురూరి రాజన్న, మంచికట్ల లక్ష్మణ్, ఎడెల్లి రాములు, డాక్ట ర్ వనం సావిత్రి, ఎం.ఎన్.చారి, కనపర్తి లక్ష్మయ్య, దండు ఆంజనేయరాజుల కవితలను జ్యోతి కిర ణాలు 2లో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో ీకార్పొరేటర్ కొలిపాక సుజాత, కవులు శ్రీదాస్యం లక్ష్మయ్య, మాడిశెట్టి గోపాల్, డాక్టర్ వైరాగ్యం ప్ర భాకర్, ఏళేశ్వరం వెంకటేశ్వర్లు, రెవా సభ్యులు వెంకటేశ్వర్‌రావు, రాంనారాయణ, కృష్ణయ్య, రాజే శ్వర్, బండారి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 11 , 2024 | 12:42 AM