ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యువతకు క్రీడల్లో ప్రత్యేక శిక్షణనివ్వాలి

ABN, Publish Date - Nov 07 , 2024 | 12:45 AM

ప్రతిభావంతమైన యువతను గుర్తిం చి వారి చదువులకు ఆటంక కలుగకుండా క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని రామగుండం ఎమ్మె ల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు.

గోదావరిఖని, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రతిభావంతమైన యువతను గుర్తిం చి వారి చదువులకు ఆటంక కలుగకుండా క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని రామగుండం ఎమ్మె ల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నూతన క్రీడా విధానం రూపకల్పన, స్పోర్ట్స్‌ హబ్‌ తదితర అంశాలపై సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన హాజరై పలు సూచనలు చేశారు. క్రీడాకారుల నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు అంతర్జాతీయ క్రీడా రంగంలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా సమగ్ర క్రీడా విధానాన్ని రూపొందించాలని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. ప్రతిపాదిత క్రీడా విధానంలో బౌగోళక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవడంతో యువత ఆసక్తి కనబరిచే క్రీడలను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలన్నారు. పాఠ శాల స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేలా క్రీడా విధానంలో నిబంధనలు పెట్టాల న్నారు. పాఠశాల స్థాయిలోనే క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్కేక స్కాలర్‌షిప్‌లు అందజేసి ప్రోత్సహించాలన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేలా వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లోని విధానాలను అధ్యయనం చేయుయాలని అధికారు లకు సూచించారు అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో ఎంఓయూ చేసుకోవ డం ద్వారా కోచ్‌ల సేవలను వినియోగించుకోవచ్చునన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా క్రీడాశాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌, ఓఎస్‌డీ జితేందర్‌రెడ్డి, స్సోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 12:45 AM