ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఖమ్మం.. కాంగ్రెస్‌ జిల్లా అని చాటుతాం

ABN, Publish Date - Apr 26 , 2024 | 05:47 AM

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎ్‌సను గద్దె దించామని, అదే స్ఫూర్తితో లోక్‌సభ ఎన్నికల్లోనూ గెలుస్తామని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీని ఓడించి.. రాహుల్‌ను ప్రధానిని చేసుకోవాలంటే కాంగ్రె్‌సను భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.

‘అసెంబ్లీ’ స్ఫూర్తితో ఈ ఎన్నికల్లోనూ గెలుస్తాం

ఖమ్మం, మహబూబాబాద్‌లో భారీ మెజారిటీ ఖాయం

మంత్రులు తుమ్మల, పొంగులేటి, ఎంపీ రేణుకా చౌదరి

ఖమ్మం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎ్‌సను గద్దె దించామని, అదే స్ఫూర్తితో లోక్‌సభ ఎన్నికల్లోనూ గెలుస్తామని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీని ఓడించి.. రాహుల్‌ను ప్రధానిని చేసుకోవాలంటే కాంగ్రె్‌సను భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఖమ్మం.. కాంగ్రెస్‌ జిల్లా అని చాటాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌ ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి నామినేషన్‌ అనంతరం గురువారం వారు మీడియాతో మాట్లాడారు. అందరి అభిప్రాయం మేరకే సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురాంరెడ్డికి అధిష్ఠానం ఖమ్మం టికెట్‌ ఇచ్చిందని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ త్యాగాలకు నిదర్శనం సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అని అన్నారు. ఇండియా కూటమి పక్షాన ఈ సారి రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు ఖమ్మం, మహబూబాబాద్‌ స్థానాల్లో కాంగ్రె్‌సను మంచి మెజారిటీతో గెలిపిద్దామన్నారు. ఎంపీ రేణుకాచౌదరి మాట్లాడుతూ అధిష్ఠానంతో పాటు జిల్లా ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు ఖమ్మం అభ్యర్థిగా రఘురాంరెడ్డిని ఎంపిక చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ఎంపీలు ఎక్కువ మంది గెలిస్తే రాష్ట్రానికి సంబంధించిన నిధులు, హక్కులు సాధించుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రధాని మోదీ మహిళల మంగళసూత్రాలను కాంగ్రెస్‌ లాక్కొంటుందని హేళనగా మాట్లాడడం బాధాకరమన్నారు. మంగళసూత్రాల విలువ ఆయనకేం తెలుస్తుందన్నారు. ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ మోదీ పాలనలో గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచారని, రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌ కుటుంబానికి చెందిన తాను ఖమ్మం జిల్లాకు లోకల్‌ వాడినేనని, అన్ని నియోజకవర్గాల ప్రజలు తనకు ఓటేసి దీవించాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం గాడి తప్పిందన్నారు. మతపరంగా ప్రజల్లో చిచ్చుపెట్టి బీజేపీ లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. ఖమ్మం, మహబూబాబాద్‌లో కాంగ్రె్‌సను గెలిపించి సత్తా చూపుతామన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 05:47 AM

Advertising
Advertising