Bhadradri: భద్రాద్రి రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు
ABN, Publish Date - Jan 14 , 2024 | 09:46 AM
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో బాగంగా ఆదివారం బేడా మండపంలో శ్రీ రంగనాథ గోదాదేవి కళ్యాణ వేడుక జరుగనుంది.
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో బాగంగా ఆదివారం బేడా మండపంలో శ్రీ రంగనాథ గోదాదేవి కళ్యాణ వేడుక జరుగనుంది. బోగి పండుగ సందర్బంగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో దేవస్థానం కిటకిటలాడుతోంది.
ఏటా భోగి రోజు గోదాదేవి రంగనాథుల కళ్యాణం జరుగుతుంది. వైష్ణవ ఆలయాల్లో జరిగే ఈ కళ్యాణ వేడుక తిలకించేందుకు రెండుకళ్లు సరిపోవు...గోదాదేవి శ్రీ రంగనాథుడిలో ఐక్యం అయ్యే ఆ వేడుక చూసిన అవివాహితులకు కళ్యాణ యోగం, పెళ్లి అయిన వారు జీవితంలో సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు.
Updated Date - Jan 14 , 2024 | 09:46 AM