ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: ఎలుగుబంటి వరుస దాడులు.. బెంబేలెత్తుతున్న ప్రజలు

ABN, Publish Date - Jan 30 , 2024 | 09:43 AM

Telangana: జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. చండ్రుగొండ మండలంలో ఎలుగుబంటి ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఎలుగుబంటి వరుస దాడులతో మండల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 30: జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. చండ్రుగొండ మండలంలో ఎలుగుబంటి ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఎలుగుబంటి వరుస దాడులతో మండల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చండుగొండ మండల కేంద్రంలో రెండో రోజు మరో వ్యక్తిపై ఎలుగుబంటి దాడికి తెగబడింది. మద్దుకూరు గ్రామంలో నల్లమోతు రామారావుపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన జరిగి 24 గంటలు గడవకముందే మరో వ్యక్తిని గాయపరిచింది.

చండ్రుగొండ గ్రామ శివారు అంబేద్కర్ కాలనీలో కంచర్ల తిరుపతి అనే వ్యక్తి ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో తిరుపతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఎలుగుబంటి దాడితో ప్రజలు వణికిపోతున్నారు. బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఏ వైపు నుంచి వచ్చి ఎలుగుబంటి దాడి చేస్తుందో అని మండల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అటవీశాఖ అధికారులు త్వరితగతిన స్పందించి ఎలుగుబంటిని బంధించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 30 , 2024 | 09:43 AM

Advertising
Advertising