ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Khushbu Sundar: ఫిల్మ్‌ ఇండస్ట్రీ చూస్తూ కూర్చోదు

ABN, Publish Date - Oct 03 , 2024 | 08:28 AM

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు (Konda Surekha Comments) సంచలనం కలిగిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై సురేఖ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోఆమె అక్కినేని ఫ్యామిలీతో సహా హీరోయిన్ సమంతను కూడా ఈ వివాదంలోకి లాగారు.

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు (Konda Surekha Comments) సంచలనం కలిగిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై సురేఖ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీతో సహా హీరోయిన్ సమంతను వివాదంలోకి లాగారు. నాగచైతన్య, నాగార్జున, సమంత పేర్లను ఈ విషయంలో ప్రస్తావించడం, వారి వ్యక్తిగత విషయాలను మీడియా ముందు మాట్లాడటంతో ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మంత్రి సురేఖ వ్యాఖ్యలను అక్కినేని కుటుంబం, సమంత తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, సింగర్ చిన్మయి, మాజీ మంత్రి రోజా తదితరులు స్పందించగా.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, నానీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు సినీ నటి, బీజేపీ మహిళా నేత కుష్బూ సుందర్‌ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు.


కించపరిచే ప్రకటనలు చేయరాదు: కుష్బూ సుందర్‌

‘‘సురేఖ మీలోని విలువలు ఏమైపోయాయి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు సినీ పరిశ్రమపై భయంకరమైన, కించపరిచే ప్రకటనలు చేయరాదు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఫిల్మ్‌ ఇండస్ట్రీ చూస్తూ కూర్చోదు. సినీ పరిశ్రమకు చెందిన మహిళలకు సురేఖ క్షమాపణలు చెప్పాలి’’ అని కుష్బూ సుందర్‌ డిమాండ్ చేశారు.


అలా మాట్లాడటం చూసి షాక్‌ అయ్యా: హీరో సుశాంత్‌

కొండా సురేఖ తన వ్యాఖ్యల్నివెనక్కి తీసుకుని, క్షమాపణలు చెప్పాలని హీరో సుశాంత్‌ డిమాండ్ చేశారు. ‘‘రాజకీయ ప్రత్యర్థికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమయంలో.. ఒక మంత్రిగా నా కుటుంబంతో పాటు.. సమంతను కించపరిచే విధంగా మాట్లాడటం చూసి షాక్‌ అయ్యా. ఎవరినీ బాధపెట్టి ఇలా రాజకీయాల్లోకి లాగకూడదు.. బాధ్యతారాహిత్య ప్రవర్తనను అందరూ ఖండించాలి’’ అని హీరో సుశాంత్‌ పేర్కొన్నారు.

Updated Date - Oct 03 , 2024 | 10:22 AM