ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘కొండా’ ఆస్తులు 4,490 కోట్లు

ABN, Publish Date - Apr 23 , 2024 | 04:42 AM

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆస్తులు రూ.4,490 కోట్లు! అప్పులు రూ.13.83 కోట్లు! వేల కోట్లు ఆస్తులున్నా కొండా దంపతుల పేరున కానీ, వారి కుమారుడి పేరున కానీ ఒక్క వాహనం కూడా లేకపోవడం గమనార్హం.

భారీగా స్థిర, చరాస్తులు, షేర్లు..అప్పులు రూ.13.83 కోట్లు.. చేతిలో నగదు 9 లక్షలు

వేల కోట్లున్నా సొంత వాహనం లేదు!

రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆస్తులు రూ.4,490 కోట్లు! అప్పులు రూ.13.83 కోట్లు! వేల కోట్లు ఆస్తులున్నా కొండా దంపతుల పేరున కానీ, వారి కుమారుడి పేరున కానీ ఒక్క వాహనం కూడా లేకపోవడం గమనార్హం. కొండా తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు ప్రకటించారు. ఆయన పేరుమీద రూ. 1,178.72 కోట్ల ఆస్తులు ఉండగా ఆయన భార్య సంగీతా రెడ్డి పేరిట రూ.3,203.90 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన కుమారుడు వీరజ్‌ మాధవరెడ్డి పేరున ఉన్న ఆస్తులు రూ.107.44 కోట్లు! కొండా వద్ద 3 లక్షలు, ఆయన భార్య వద్ద 6 లక్షల నగదు ఉన్నట్లు చూపించారు. ఆయన పేరుమీద వివిధ బ్యాంకుల్లో అప్పు రూ.17.69 లక్షలు, ఆయన భార్య పేరిట రూ.12.06 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన వద్ద రూ.60 లక్షలు, ఆయన భార్య వద్ద రూ.10.44 లక్షల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలు ఉన్నట్లు చూపించారు. కొండా పేరున చేవెళ్లలో మూడు ఎకరాలు, ధర్మసాగర్‌లో 43.26 ఎకరాలు, చేవెళ్ల మండలం కమ్మెటలో రెండు ఎకరాలు, కుమ్మెరలో 21.13 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు వెల్లడించారు. ఆయన భార్య పేరిట రాజేంద్రనగర్‌ మండలం నార్సింగిలో ఎకరం, ఏపీలోని చిత్తూరు జిల్లాలో 14.13 ఎకరాల సాగుభూమి ఉన్నట్లు ప్రకటించారు. చేవెళ్ల, గంధంగూడలో 5 ఓపెన్‌ ప్లాట్లు, బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12, ఉస్మాన్‌గంజ్‌, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 86లో వాణిజ్య భవనాలు, బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 13, పుప్పాలగూడలో నివాస భవనాలు ఉన్నట్లు చూపించారు. ఆయనతో పాటు భార్య, కొడుకు పేరిట ఉన్న ఖాళీ ప్లాట్లు, కమర్షియల్‌, నివాస భవనాల విలువ రూ.78 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నారు.

సునీతా రెడ్డి ఆస్తులు 60.72 కోట్లు.. కారు లేదు!

మేడ్చల్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): తమ కుటుంబానికి రూ. 60.72 కోట్ల ఆస్తులు ఉన్నట్లు మల్కాజిగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు. ఆమె పేరిట రూ.51.95 లక్షలు, ఆమె భర్త మహేందర్‌రెడ్డి పేరున రూ.5.51 లక్షలు, కుమారుడు రినీష్‌ రెడ్డి పేరుమీద రూ.19.2 లక్షల చరాస్తులు ఉన్నట్టు వెల్లడించారు. రూ.59.96 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో ఆమె పేరిట రూ.30.84 కోట్లు, భర్త పేరిట రూ.3.55 కోట్లు, కుమారుడి పేరిట రూ.25.57 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు వివరించారు. రూ.2.5 కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. తన విద్యార్హత పదో తరగతిగా పేర్కొన్నారు. తమ పేరిట ఎలాంటి వాహనాలు లేవని తెలిపారు.

షెట్కార్‌ ఆస్తులు రూ.12 కోట్ల పైమాటే

సంగారెడ్డి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): జహీరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎంపీ సురేష్‌ కుమార్‌ షెట్కార్‌ కోటీశ్వరుడే. తన కుటుంబ ఆస్తుల విలువ రూ.12 కోట్ల పైనే ఉంటుందని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దాని ప్రకారం.. షెట్కార్‌ కుటుంబం పేరిట ఉన్న డిపాజిట్లు, బంగారు ఆభరణాల విలువ రూ.57.51 లక్షలు. ఆయన భార్య ఉమాదేవి పేరిట డిపాజిట్లు, నగల విలువ రూ.2.61 కోట్లు. నారాయణఖేడ్‌, జుక్కల్‌, నాగిల్‌గిద్ద ప్రాంతాల్లో రూ.3.49 కోట్ల విలువైన 28.32 ఎకరాల భూములు ఉన్నాయి. నిర్మాణ సంస్థల్లో పెట్టుబడుల విలువ రూ.7.12 కోట్లు.

మల్లే్‌షకు రూ.119.14 కోట్ల ఆస్తి

యాదాద్రి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): భువనగిరి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి క్యామ మల్లేష్‌ పేరిట రూ.119.14 కోట్ల ఆస్తి ఉండగా ఆయన భార్య జంగమ్మ పేరున రూ.26.20 కోట్ల ఆస్తి ఉంది.

బీబీ పాటిల్‌పై పెండింగ్‌లో 19 కేసులు

జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి, సిటింగ్‌ ఎంపీ బీబీ పాటిల్‌ కుటుంబం ఆస్తుల విలువ రూ.144 కోట్లపైనే ఉంది. స్థిరాస్తుల విలువ రూ.142.85 కోట్లు వుంటుందని ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. ఆయనకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో లో రూ.54.34 లక్షలు, ఆయన భార్య అరుణ పాటిల్‌కు రూ.21.64 లక్షల ఆదాయం వచ్చింది. తన పేరిట రూ.3.40 కోట్లు, తన భార్య పేరిట రూ.11.25 లక్షల అప్పులు ఉన్నాయని తెలిపారు. బెంజ్‌, స్కోడా, మహీంద్రా ఎక్స్‌యూవీ 500, స్కార్పియో తదితర 16 వాహనాలు పాటిల్‌ వద్ద ఉన్నాయి. తనపై 19 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పాటిల్‌ పేర్కొన్నారు.

సీతారాం నాయక్‌ ఆస్తులు 3.08 కోట్లు

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ లోక్‌సభ బీజేపీ ఎంపీ అభ్యర్థి, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్‌పై కేసులేమీ లేవు. ఆయన భార్య, ఇద్దరు కుమారుల ఆస్తుల విలువ రూ.3.08 కోట్లు కాగా అప్పులు రూ.1.37 కోట్లు ఉన్నాయి.

Updated Date - Apr 23 , 2024 | 04:42 AM

Advertising
Advertising