కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఆదర్శం
ABN, Publish Date - Nov 17 , 2024 | 01:03 AM
దేవరకొండ, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భవి ష్యత తరాలకు ఆదర్శమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత బాలూనాయక్ అన్నారు.
దేవరకొండ, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భవి ష్యత తరాలకు ఆదర్శమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత బాలూనాయక్ అన్నారు. పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో దేవరకొండలో ఏర్పాటు చేసిన లక్ష్మణ్‌బాపూజీ కాంస్య విగ్రహాన్ని శని వారం ఆవిష్కరించి మాట్లాడారు. బాపూజీ తెలంగాణ ఉద్యమంలో ఆయన సేవలను గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం 1969లో మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధత కలిగిన నాయకుడు బాపూజీ అన్నారు. కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్మన ఆలంపల్లి నర్సింహ, సీనియర్ న్యాయ వాది, దేవరకొండ మాజీ సర్పంచ చిలువేరు కాశీనాథ్, సంఘం అధ్యక్షుడు కండగట్ల స్వామి, భద్రచలం పద్మశాలీ సంఘం అన్నదాన సత్రం అధ్యక్షుడు బొసిక యాదగిరి, దేవరకొండ పద్మ శాలిసంఘం అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, పగిడిమర్రి రఘురాములు, పున్న వెంకటేశ్వర్లు, రాపోలు వీరమోహన, పులిపాటి నర్సింహ, గాజుల ఆంజనేయులు, పుష్పలత, గాజుల మురళి, పున్న శైలజ, ముసిని అంజన పాల్గొ న్నారు.
Updated Date - Nov 17 , 2024 | 01:03 AM